International

Crime : స్కూల్లో కాల్పులు..ముగ్గురు టీచర్లు, స్టూడెంట్స్ మృతి

రచన: Kumar3 నిమిషాల పఠనం

ఓ విద్యార్థి ఘాతుకానికి ముగ్గురు విద్యార్థులు, ముగ్గురు టీచర్లు బలయ్యారు. పాఠశాలకు తుపాకీ తీసుకుని వచ్చిన ఓ స్టూడెంట్ విచక్షణారహితంగా కాల్పులు జరపడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈ ఘటన థాయ్‌లాండ్‌లోని ఓ పాఠశాలలో వెలుగుచూసింది. ఇదే ఘటనలో మరో 15 మంది తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

వివరాల్లోకివెళితే.. బ్యాంకాక్ శివారులోని 'నాంథబురి' ప్రాంతంలో గల ఓ పాఠశాలలో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. తుపాకీతో తరగతిలోకి ఎంట్రీ ఇచ్చిన ఓ స్టూడెంట్ ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించాడు. గన్ శబ్దాలు విన్న ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురై ప్రాణాలు దక్కించుకోవడానికి వేరే క్లాస్ రూముల్లోకి వెళ్లి తలుపులు వేసుకుని దాక్కున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు.

అనంతరం పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. విద్యార్థులు, టీచర్లకు రక్షణ కల్పించడంతో వారంతా క్షేమంగా బయటపట్టారు.విద్యార్థి ప్లాన్ ప్రకారమే తన ఇంట్లోని తుపాకీని పాఠశాలకు ఎవరికీ తెలియకుండా తీసుకొచ్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనపై థాయ్ ప్రధాని అనుతిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసాయం అందించాలని పోలీసు,ఆరోగ్యశాఖ అధికారులకు ప్రధాని ఆదేశాలు జారీచేశారు. కాల్పులు జరిపిన విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్టు సమాచారం.

#gun fire#school#students teachers died#thailand#crime
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి