సినిమా

Priyanka Mohan: పవన్ సినిమా తర్వాత మళ్ళీ తెలుగులో కనిపించని తమిళ కుట్టి

రచన: Anshu4 నిమిషాల పఠనం

Priyanka Mohan: ప్రియాంక అరుళ్ మోహన్..ప్రస్తుతం తెలుగులో ఒక్క సినిమా కూడా సైన్ చేయలేదు. వాస్తవానికి, ఈ బ్యూటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో డాక్టర్ కణ్మణి పాత్రలో కనిపించింది. స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ. కాబట్టే, సుజీత్ ప్రియాంకను తీసుకున్నాడని మాట్లాడుకున్నారు.

Priyanka Mohan: ప్రియాంక అరుళ్ మోహన్..ప్రస్తుతం తెలుగులో ఒక్క సినిమా కూడా సైన్ చేయలేదు. వాస్తవానికి, ఈ బ్యూటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో డాక్టర్ కణ్మణి పాత్రలో కనిపించింది. స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ. కాబట్టే, సుజీత్ ప్రియాంకను తీసుకున్నాడని మాట్లాడుకున్నారు.

ఏదేమైనా, ఐరెన్ లెగ్ అనే ముద్ర నుంచి స్టార్ హీరోయిన్‌గా పాన్ ఇండియన్ సినిమాలు చేసే రేంజ్ కి వెళ్ళిన శ్రుతి హాసన్ మాదిరిగా పవన్ కళ్యాణ్ తో చేస్తే లైఫ్ టర్న్ అవుతుందని ఆశపడింది ప్రియాంక. కానీ, ఓజీ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకూ ఒక్క తెలుగు సినిమాలో నటించే అవకాశం అందుకోలేదు. నిజంగా, ఇది కాస్త షాకింగ్ విషయమే. అందం, అభినయం ఉన్నా కూడా ఎందుకో ఈ బ్యూటీకి ఛాన్స్ రాలేదు.

ప్రస్తుతం, తమిళంలో ఒక సినిమా, కన్నడలో ఒక సినిమాను చేస్తోంది. కొన్ని కమర్షియల్ యాడ్స్ లో మెరుస్తుంది. చెప్పాలంటే ప్రియాంక అందచందాలు.. అటు యూత్ హీరోలకి, ఇటు సీనియర్ హీరోలకి సరిగ్గా సరిపోయే ఫిజిక్. తెలుగులో ఆమె నటించిన నాని గ్యాంగ్ లీడర్, సరిపోదా శనివారం ఫ్లాపయ్యాయి. అలాగే, శర్వానంద్ సరసన చేసిన శ్రీకారం మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద తిరగబడింది.

తమిళంలో మాత్రం శివ కార్తికేయన్ తో చేసిన రెండు సినిమాలు ఫరవాలేదనిపించాయి. మధ్యలో స్పెషల్ నంబర్ కూడా చేసింది. అవి కూడా విరివిగా వచ్చింది లేదు. తెలుగు, తమిళం, కన్నడ, కొరియన్ ఇంగ్లీష్ మూవీ చేసినా కూడా, ఈ బ్యూటీకి సరైన స్టార్ డమ్ మాత్రం దక్కలేదు. ఇప్పుడు సౌత్‌లో ఉన్న అన్నీ భాషలలో హీరోయిన్స్ కొరత ఉంది. ప్రియాంక లాంటి వాళ్లు అవకాశాల కోసం చాలా ఎదురుచూస్తున్నారు. మరి, ఎందుకు వీరికి ఛాన్స్ రావడం లేదు అంటే వారి ఖాతాలో ఉన్న ఫ్లాప్స్ మూలంగా అని సమాధానం వినిపిస్తోంది.

#priyankarulmohan#og#pawankalyan#sujeeth#nani
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి