సినిమా

The Paradise: ప్రమోషనల్ టూర్‌తో జడల్ జమానా షురూ..

రచన: Anshu4 నిమిషాల పఠనం

The Paradise: నేచురల్ స్టార్ నాని నటించిన ది ప్యారడైజ్ సినిమా రిలీజ్ కి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలింది. అయితే, ఇన్నాళ్ళు చిత్రబృందం ఎలాంటి ప్రమోషన్స్ నిర్వహించలేకపోతున్నామని చెప్పింది. థియేట్రికల్ ట్రైలర్ కూడా లేదని ఓపెన్‌గానే వెల్లడించింది. కానీ, ఉన్నట్టుంటి ఈ మూవీకి ప్రమోషన్స్ ప్లాన్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చింది. తాజాగా, దీనికి సంబందించిన అప్‌డేట్‌ని మేకర్స్ వదిలారు.

సెప్టెంబర్ 24న థియేట్రికల్ రిలీజ్ కాబోతోంది నాని నటించిన ది ప్యారడైజ్. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాడు. హీరోయిన్‌గా కయాదు లోహర్ నటించింది. ఇన్నాళ్ళు ఆమె అప్‌డేట్స్ గానీ, ఆ పాత్రకి సంబందించిన లీకులు గానీ మేకర్స్ నుంచి రాలేదు. ఈ విషయంలోనూ ప్యారడైజ్ టీమ్ కొంత నెగిటివ్ కామెంట్స్‌ను ఎదుర్కుంది.

దీంతో పనిలో పనిగా నాని-కయాదు లోహర్ కలిసి లైటర్ దగ్గర సిగరెట్ వెలిగిస్తున్న పోస్టర్‌ను రిలీజ్ చేసి ఒక్కసారిగా అగ్గి రాజేశారు. ఈ అప్‌డేట్‌తో హీరోయిన్‌కి మంచి స్క్రీన్ స్పేస్ దొరికిందని తేలిపోయింది. ఇదే, క్రమంలో ప్యారడైజ్ బృందం.. ప్రమోషనల్ టూర్‌ను నిర్వహించబోతున్నట్లు అధికారికంగా ఎక్స్ ద్వారా వెల్లడించారు. దీంతోం సినిమాను ప్రేక్షకులకి చేరువ చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారని అర్థమవుతోంది.

ఇక, ఈ ప్రమోషనల్ టూర్‌ను ఈ సెప్టెంబర్ 17న చెన్నై, 18న బెంగళూరు, 19న కొచ్చి ఆ తర్వాత సెప్టెంబర్ 21న హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో ప్యారడైజ్ టీమ్ నిర్వహించనుంది. అసలేమాత్రం ప్రమోషన్స్ ఉండవేమో అని ఫీలైన అభిమానులకి ఈ మాత్రం ట్రీట్ ఉంటే చాలని ఈ అప్‌డేట్ వచ్చాక చెప్పుకుంటున్నారు. ఇక, నాని కెరీర్‌లో మొదటిసారి చేస్తున్న ఓ భారీ ప్రయోగం ఇదని చెప్పాల్సిందే. మరి, ఈ ప్రయోగం ఎంతవరకూ సక్సెస్ అవుతుందో 24వ తేదీ వరకూ వేచి చూస్తే గానీ తెలియదు.

#The Paradise#Nani#Kayadu Lohar#Srikanth Odela#Keerthy Suresh
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి