బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటును ప్రభావితం చేసేంందుకు ఓ ప్రజాప్రతినిధికి లంచం ఆఫర్ చేసిన కేసులో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో ఏసీబీ అధికారులకు చిక్కిన విషయం తెలిసిందే. ఆ కేసుపై తాజాగా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.అయితే, తన మీద నమోదైన కేసు కొట్టివేయాలని సుప్రీంకోర్టును రేవంత్ రెడ్డి కోరినట్టు తెలిసింది.
కేసు విచారణలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి తరఫున సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. 2015లో జరిగిన ఘటనకు 2018లో సవరించిన అవినీతి నిరోధక చట్టం వర్తించదని సుప్రీంకోర్టుకు రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది వివరించారు. అయితే, ఓటు అనేది చట్టబద్ధమైన హక్కు అని, దానిని ప్రభావితం చేసినప్పుడు అవినీతి నిరోధక చట్టం వర్తిస్తుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది.
తదుపరి విచారణలో బీఆర్ఎస్ తరఫు న్యాయవాది వాదనలు వింటామని, ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని పేర్కొంటూ న్యాయస్థానం కేసును వాయిదా వేసింది. ఇదిలాఉండగా, గత నెలలో విదేశీ పర్యటనకు వెళ్లేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఏసీబీ కోర్టు అనుమతి తీసుకున్న విషయం తెలిసిందే.నాడు విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు షరతులతో అనుమతి ఇచ్చింది.
దాంతో ఆయన యూకె, యూఎస్, జర్మనీ, చైనాకు వెళ్లారు. దీనికి తోడు ఓటుకు నోటు కేసులో బెయిల్ కండీషన్లు సడలించాలని కోరగా రూ.లక్ష ష్యూరిటీ, విదేశాల్లో ఉండే అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలని కండీషన్ పెట్టి.. షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 18లోగా పాస్ పోర్టు తిరిగి అప్పగిస్తానని అఫిడవిట్ సమర్పించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది.కాగా, రేపటితో ఆ గడువు ముగుస్తుండటంతో అధికారులు సీఎం పాస్‌పోర్టును ఏసీబీ కోర్టులో అప్పగించనున్నట్టు సమాచారం.
https://x.com/TeluguScribe/status/2100480191722381633?s=20












