వ్యాపారం

40ప్లస్ ఉద్యోగులకు లేఆఫ్స్ టెన్షన్.. ఈ ఏడాది 1.28లక్షల మందిపై వేటు!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

భారతీయ కార్పొరేట్ రంగంలో 40నుంచి 45ఏళ్ల వయసున్న సీనియర్ ఉద్యోగుల్లో ఉద్యోగ భద్రతపై తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు సుదీర్ఘ అనుభవానికి పెద్దపీట వేసిన కంపెనీలు, ఇప్పుడు ఖర్చుల నియంత్రణ నెపంతో నడివయసు ఉద్యోగులపైనే వేటు వేస్తున్నాయి.

భారతీయ కార్పొరేట్ రంగంలో 40నుంచి 45ఏళ్ల వయసున్న సీనియర్ ఉద్యోగుల్లో ఉద్యోగ భద్రతపై తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు సుదీర్ఘ అనుభవానికి పెద్దపీట వేసిన కంపెనీలు, ఇప్పుడు ఖర్చుల నియంత్రణ నెపంతో నడివయసు ఉద్యోగులపైనే వేటు వేస్తున్నాయి. టెక్ దిగ్గజం ఒరాకిల్, స్పోర్ట్స్ బ్రాండ్ అడిడాస్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఇటీవల చేపట్టిన పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా అధిక వేతనాలు తీసుకుంటున్న సీనియర్, మేనేజీరియల్ స్థాయి ఉద్యోగులను విధుల్లోంచి తొలగించడం ఈ ఆందోళనలకు ప్రధాన కారణమైంది.

 సంస్థాగత పునర్నిర్మాణం పేరిట మేనేజ్‌మెంట్ స్థాయిలను తగ్గించడం, బృందాలను విలీనం చేయడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆటోమేషన్ టూల్స్‌ను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడమే ఈ కోతలకు వెనుక ఉన్న అసలు కారణం. 2026 మే నాటికి తన ప్రపంచవ్యాప్త సిబ్బందిని తగ్గించుకుంటున్నట్లు ప్రకటించిన ఒరాకిల్, భవిష్యత్ ఏఐ సాంకేతికతలపై పెట్టుబడులు పెంచుతోంది. మరోవైపు, అడిడాస్ సంస్థ కూడా గురుగ్రామ్‌లోని టెక్నాలజీ కార్యకలాపాలను రీస్ట్రక్చర్ చేస్తూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులపై ప్రభావం పడేలా నిర్ణయాలు తీసుకుంది.

 ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో లేఆఫ్స్ పర్వం ముమ్మరంగా సాగుతోంది. 2026 సెప్టెంబర్ నాటికే దాదాపు 300కంపెనీల్లో 1.28లక్షల మందికి పైగా ఐటీ ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. ఈ సంఖ్య గత 2025 సంవత్సరం కంటే అత్యంత వేగంగా పెరగడం గమనార్హం. కేవలం దశాబ్దాల అనుభవం ఉందన్న కారణంతో ఉద్యోగాలు శాశ్వతంగా ఉంటాయని భావించడం పొరపాటని, సాంకేతిక మార్పులకు అనుగుణంగా ప్రొడక్టివిటీ చూపించని ఉద్యోగులపై యాజమాన్యాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

 నలభై ఏళ్ల వయసులో ఉద్యోగం పోవడం వల్ల కుటుంబ బాధ్యతలు, పిల్లల చదువులు, ఈఎంఐల భారం పెరిగి మానసికంగా, ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తగులుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిని అధిగమించడానికి నిరంతరం కొత్త సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవడం (అప్‌స్కిల్లింగ్) ఒక్కటే సరైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుత ఏఐ యుగానికి తగినట్లుగా తమను తాము తీర్చిదిద్దుకుంటేనే కార్పొరేట్ రంగంలో మనుగడ సాధ్యమని హెచ్చరిస్తున్నారు.

#CorporateLayoffs#MidCareerCrisis#ITJobsIndia#OracleLayoffs#AdidasTech#AIImpactOnJobs#CareerAdvice#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి