Rajamouli-Varanasi: దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తన దర్శకత్వంలో రూపొందిస్తున్న వారణాసి సినిమా గురించి ఇండియాలో ప్రస్తుతానికి ఎలాంటి అప్‌డేట్స్ ఇవ్వకపోయినా..బాలీవుడ్..హాలీవుడ్‌లో మాత్రం సినిమాకి సంబందించిన ఏదో ఒక విషయాన్ని వెల్లడిస్తూ ముందుగా అక్కడ బిజినెస్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన వారణాసిలో మహేష్-ప్రియాంక పాత్రలపైకీలకమైన విషయాన్ని రివీల్ చేశారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న వారణాసి సినిమా..ప్రపంచ దేశాలలో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించాడు రాజమౌళి. ఇప్పటికే, అక్కడ పలు మీడియా ఛానల్స్‌లో పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూస్ ద్వారా సినిమాకి సంబందించిన విషయాలను రివీల్ చేశారు. మొన్నామధ్య ఇందులో రామాయణ ఎపిసోడ్ 25 నిముషాల పాటు ఉంటుందని..అయితే, ఒకేసారి ఆ పార్ట్ మొత్తం చూపించలేదని..తెలిపాడు.
ఇక, తాజాగా వారణాసి సినిమాకి మహేష్ బాబు, ప్రియాంక చోప్రాలను ఎందుకు తీసుకున్నాడో వెల్లడించాడు జక్కన్న. "నా సినిమాలలో రామాయణం, మహాభారతం ఇతిహాసాల ప్రభావం సహజంగానే ఉంటుంది. ఇక, ఇప్పుడు చేస్తున్న వారణాసి మూవీలో రామాయణకి సంబందించిన ఒక ఘట్టాన్ని నేరుగానే చూపిస్తున్నా..కథకి టైం లైన్ ఉంటుంది. క్రీ.పూ.7000 కాలం నుంచి మొదలై 2027 నాటి ఆధునిక కాలం వరకూ కథ సాగుతుంది.
మహేష్ బాబును దృష్ఠిలో పెట్టుకునే రుద్ర పాత్రను తయారు చేశాను. మహేష్ లో సహజంగా కనిపించే టైమింగ్, నిజాయితీని పాత్రలో ప్రతిబింబించేలా రుద్ర పాత్ర రూపొందించాను. ఈ క్యారెక్టర్‌లో చిలిపితనం మాత్రమే కాకుండా పరిస్థితికి తగ్గట్టుగా ఎంతో నిబద్దత, తీవ్రత కూడా ఉంటుంది"..అని చెప్పాడు రాజమౌళి. అలాగే, మందాకిని పాత్రలో యాక్షన్ సీన్స్‌లో సమర్థవంగా నటించడంతో పాటు అవసరమైన చోట భావోద్వేగాలు, పాత్రలోని సున్నితత్వాన్ని కూడా అద్భుతంగా చూపించగలిగే నటి కావాలి. ఈ రెండు ప్రియాంక అద్భుతంగా చూపించగలదని ఆమెను ఎంచుకున్నట్టుగా తెలిపాడు. మొత్తానికి, రాజమౌళి వారణాసి సినిమాలోని ప్రధాన పాత్రలకి ఉన్న బలాన్ని తెలిపి ఆసక్తిని రెట్టింపు చేశాడు.












