తెలంగాణ

Congress : 2004 ఎన్నికల అఫిడవిట్‌లో కేసీఆర్‌కు ఒక్క ఎకరం కూడా లేదు : మంత్రి పొంగులేటి

రచన: Kumar4 నిమిషాల పఠనం

ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు అధికారంలో ఉన్నప్పుడు ఎంత సంపాదించుకున్నారు? ఎన్ని వేల ఎకరాలు వెనకేసుకున్నారు? అనే అంశం మీద ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతోంది. నిన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం ‘ధరణి’ మాటున వందల ఎకరాల భూదోపిడీకి పాల్పడిందని ఆరోపించారు.

ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు అధికారంలో ఉన్నప్పుడు ఎంత సంపాదించుకున్నారు? ఎన్ని వేల ఎకరాలు వెనకేసుకున్నారు? అనే అంశం మీద ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతోంది. నిన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం ‘ధరణి’ మాటున వందల ఎకరాల భూదోపిడీకి పాల్పడిందని ఆరోపించగా.. ఆ వెంటనే మాజీ మంత్రి హరీశ్ రావు సైతం.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు ఆయనకు ఎంత భూమి ఉంది? ఇప్పుడు ఎంత ఉందో లెక్కలు చెప్పారు.

ఇవాళ ఉదయం తెలంగాణ భవన్ వేదికగా కేటీఆర్.. సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇవ్వగా.. తాజాగా కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ‘ఎక్స్’ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల అఫిడవిట్‌ ఆధారంగా ‘కల్వకుంట్ల ముఠా’ అడ్డంగా దొరికిపోయిందని.. సున్నా ఎకరాల నుండి రూ.వేల కోట్ల విలువైన ఆస్తులకు ఎదిగిన భూ బకాసురుడు కేసీఆర్ అని మంత్రి పొంగులేటి విమర్శించారు. 2004 కరీంనగర్ లోక్‌సభ ఎన్నికల అఫిడవిట్‌లో ఒక్క ఎకరం కూడా భూమి లేదని తెలిపిన కేసీఆర్‍కు.. ఇప్పుడు రూ.వేల కోట్ల విలువైన భూములు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.

కేసీఆర్‌కు పుట్టుకతోనే వందల ఎకరాలు ఉన్నాయని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 2004 నాటి కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్‌ను షేర్ చేసిన పొంగులేటి.. తెలంగాణ ఉద్యమ సమయంలో, బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేండ్లలో కేసీఆర్‍కు భూములు భారీగా పెరిగాయని, కేసీఆర్ సమర్పించిన గత ఎన్నికల అఫిడవిట్ల ద్వారా స్పష్టమవుతోందని చెప్పారు.

గత పదేండ్లలో ఉద్యమకారులకు అప్పులు మిగిలితే కేసీఆర్ కుటుంబానికి మాత్రం రూ. లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఇదంతా ప్రభుత్వ, పేదల, దళితుల అసైన్డ్ భూములను దోచుకోవడం వల్లే కదా?అని ప్రశ్నించారు. ఉద్యమకారుల త్యాగాల పునాదుల మీద కల్వకుంట్ల ఫ్యామిలీ రూ. లక్షల కోట్ల ఆస్తులను దోచుకుందన్నారు. డ్రామారావు మాత్రం పుట్టుకతోనే కేసీఆర్‍కు వందల ఎకరాలు ఉన్నాయని బొంకుతున్నారని ఫైర్ అయ్యారు. ఎన్నికల అఫిడవిట్‍లో తప్పులు రాసి మోసం చేసారా? లేక ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారా? అని మంత్రి పొంగులేటి నిలదీశారు.

#minister ponguleti#KTR#KCR#Crop lands#BRS#Congress#Swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి