Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు కూడా యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన ఖైదీ నంబర్ 150 మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎక్కువగా యంగ్ డైరెక్టర్స్‌తోనే సినిమాలు చేస్తున్నారు. సీనియర్ దర్శకులెవరూ ఆయనతో సినిమా చేయాలని ప్లాన్ చేయడం లేదు కూడా. ఇప్పుడు, లైన్‌లో ఉన్న యువ దర్శకుల్లో శ్రీకాంత్ ఓదెల ఒకరు. కానీ, తాజాగా..ఈ కాంబో సెట్ అవ్వాలంటే ప్యారడైజ్ హిట్టవ్వాలంటున్నారు.
చిరంజీవితో సినిమా చేయడానికి ప్యారడైజ్ సినిమా హిట్‌కి సంబంధం ఏంటీ? అని ఒక్క క్షణం ఆలోచన రావచ్చు. కానీ, ఇక్కడ బిజినెస్ పరంగా, మార్కెట్ లెక్కలు చాలా ఉంటాయి. యంగ్ డైరెక్టర్స్‌లో స్టార్‌ని స్క్రీన్ మీద చూపించడానికి ఎంతో కసితో పనిచేస్తారు. అందులో ఎలాంటి సందేహమూ ఉండదు. కానీ, సీనియర్ దర్శక-నిర్మాతలకి తెలిసినట్టుగా మార్కెట్ లెక్కలు వీరికి తెలియవు. ఇక్కడ సక్సెస్ ఒక్కటే కొలమానం.
ఒక్క హిట్ పడకపోయినా అంతకముందు చేసిన హిట్ సినిమాలను కూడా మర్చిపోతారు. అలా ఉంటుంది సినిమా వ్యాపారం అంటే. ఇదే విషయంలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకి పెద్ద ఛాలెంజ్ ఎదురుకాబోతుంది. నానితో తీసిన మొదటి సినిమా దసరా బ్లాక్ బస్టర్ అన్నారు గానీ..ఆ సినిమా ఇండస్ట్రీ వర్గాలలో చూసుకుంటే యావరేజ్ అని సరిపెట్టారు. కాబట్టి, ఇప్పుడు మరోసారి నానితో చేస్తున్న ది ప్యారడైజ్ సినిమా సక్సెస్ మీదే శ్రీకాంత్ ఓదెల కెరీర్ అన్ని రకాలుగా ఆధారపడింది.
మెగాస్టార్ అయినా పెద్ద రిస్క్ చేసి సినిమా చేయాలని కోరుకోరు. నిర్మాత బావుండాలి అని నమ్మే వ్యక్తి చిరంజీవి. కాబట్టి, ఆయన సినిమా వల్ల నిర్మాత నష్టాలను చూడకూడదని భావిస్తుంటారు. హిట్ కొట్టిన దర్శకుడికి ఉండే బలాలు వేరు. మార్కెట్ పరంగా కూడా అందరూ ఆలోచించేది..దర్శకుడి ట్రాక్ రికార్డ్. అందుకే, శ్రీకాంత్ ఓదెలకి ప్యారడైజ్ సినిమా సక్సెస్ చాలా కీలకం. ఏమాత్రం ఫలితం తేడా కొట్టినా చిరుతో ప్రాజెక్ట్ మిస్ అయ్యే ప్రమాదం ఉందంటున్నారు. ఇది, నిజం కూడా. మరి, నానితో చేస్తున్న ఈ ప్యారడైజ్ సినిమా రిలీజైయ్యాక శ్రీకాంత్‌కి ఎలాంటి సక్సెస్‌ని ఇచ్చి లైఫ్ ఇస్తుందో చూడాలి.











