తెలంగాణ

AP : యాక్సిడెంట్ కేసు పక్కకేనా?.. సీఎం చంద్రబాబుతో ఆర్ట్ డైరెక్టర్

రచన: Kumar4 నిమిషాల పఠనం

ఏపీకి చెందిన కీలక వ్యక్తులు, నేతల కొడుకులు హైదరాబాద్‌లో యాక్సిడెంట్స్ చేసి ప్రాణాలు తీస్తున్నా తెలంగాణ పోలీసులు వారి మీద కేసులు పెట్టి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి..ఇటీవల మాదాపూర్‌లో ఓ యువతిని కారుతో ఢీకొట్టి చంపిన ఏపీకి చెందిన జనసేన ఎంపీ లింగమనేని రమేశ్ కొడుకు సంజూష్ మీద ఇంతవరకు పోలీసులు చర్యలు తీసుకోలేదు.

ఏపీకి చెందిన కీలక వ్యక్తులు, నేతల కొడుకులు హైదరాబాద్‌లో యాక్సిడెంట్స్ చేసి ప్రాణాలు తీస్తున్నా తెలంగాణ పోలీసులు వారి మీద కేసులు పెట్టి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి..ఇటీవల మాదాపూర్‌లో ఓ యువతిని కారుతో ఢీకొట్టి చంపిన ఏపీకి చెందిన జనసేన ఎంపీ లింగమనేని రమేశ్ కొడుకు సంజూష్ మీద ఇంతవరకు పోలీసులు చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం అతను బయటే తిరుగుతున్నాడని ప్రచారం జరగుతోంది.

ఈ క్రమంలోనే రాయదుర్గంలో కారుతో ఢీకొట్టి ఓ వ్యక్తి మృతికి కారణమైన ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌ మీద కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని సమాచారాం.నిందితుడు ఘటనా స్థలం నుంచి పారిపోగా సీసీటీవీ కెమెరాలను పరిశీలించి పోలీసులు అతడిని పట్టుకున్నారు. సందీప్‌ను రాత్రి 11 గంటలకు న్యాయమూర్తి ముందు హాజరుపరచగా అతనికి కండీషన్ బెయిల్‌ దొరికింది.

అదే సమయంలో నిందితుడు సందీప్ డ్రగ్స్ తీసుకుంటున్నట్టు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ విషయమై మీడియా ప్రశ్నించగా.. తాము నిర్వహించిన పరీక్షల్లో ఏమీ తేలలేదని రాయదుర్గం పోలీసులు వెంటనే సమాధానం ఇచ్చారు. డ్రైవింగ్ సమయంలో మద్యం మత్తులో లేడని, యూరిన్ డ్రగ్స్ స్కీనింగ్‌లోనూ రిజల్ట్స్ నెగెటివ్ వచ్చినట్లు వెల్లడించారు. మరోవైపు తన కారుతో సందీప్ ఢీకొట్టిన ఇద్దరిలో నందులాల్ మృతి చెందగా.. జైద్‌షా అనే వ్యక్తి గాయాలతో ఆసుపత్రి పాలు అయ్యాడు.

https://x.com/pulsenewsbreak/status/2100382477206573231?s=20

ప్రస్తుతం అతని పరిస్థితి కొంత మెరుగ్గానే ఉందని వైద్యులు చెప్పారు. అయితే, తిరుమ‌ల బ్రహ్మోత్సవాలు సందర్భంగా సీఎం చంద్రబాబుతో ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఫొటో దిగి సోషల్ మీడియాలో పోస్టు చేయగా అది వైరల్ అవుతోంది. కొడుకు ఏమో హైదరాబాద్ రోడ్ల మీద ప్రమాదాలు చేస్తుంటే తండ్రి మాత్రం సీఎం చంద్రబాబుతో పిక్స్ దిగే బిజీలో ఉన్నారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ఇకపోతే బడా బాబుల కొడులకు కార్లతో ఢీకొట్టి సామాన్యులను చంపేసినా రాష్ట్ర పోలీసులు ఎందుకు కఠినసెక్షన్లు పెట్టి వారిని అరెస్టు చేయడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.కాగా, గురువు చంద్రబాబు కోసం సీఎం రేవంత్ రెడ్డి నిందితులకు మినహాయింపు ఇస్తున్నారని, సామాన్యలు, ప్రతిపక్షాల మీద మాత్రం కఠిన సెక్షన్లు పెట్టించి అరెస్టులు చేయిస్తారని బీఆర్ఎస్ నేతలు కామెంట్స్ చేస్తున్నారు.

#art director anand sai#Accused sandeep#Car accident#crime#telangana#cm chandrababu#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి