సినిమా

Ravi Teja: ‘ఇరుముడి’ తర్వాత రెమ్యునరేషన్ పెంచాడా.. వాటానా?

రచన: Anshu4 నిమిషాల పఠనం

Ravi Teja: మన హీరోలలో కొందరు నాలుగు ఫ్లాపులొచ్చినా కూడా అస్సలు రెమ్యునరేషన్ తగ్గించుకోరని ఇండస్ట్రీలో టాక్ ఉంది. కొందరు మాత్రం నిర్మాత నిలబడితే ఇంకో సినిమా చేస్తాడనే ఉద్దేశ్యంతో సినిమా రిజల్ట్ గనక తేడా కొడితే తమ రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేస్తుంటారు. లేదా, కొంతైనా వెనక్కి పంపిస్తారు. అదే, ఒక సినిమా గనక భారీ హిట్ కొట్టిందంటే రెట్టింపు చేయడానికి కూడా వెనకాడరు.

ఇటీవల కాలంలో చాలామంది హీరోలు తమ సినిమాలకి రెమ్యునరేషన్ భారీగానే తీసుకుంటున్నారని చెప్పుకుంటున్నారు. బడ్జెట్ పెరగకుండా చూసుకునేది బాలయ్య మాత్రమే అని కుండ బద్దలు కొట్టినట్టు కొట్టి చెబుతారు కూడా. ఆయన సినిమాకి బడ్జెట్ ఎంత ఖర్చు చెయ్యాలో అంతే చెయ్యాలి..దానికి మించి గనక బడ్జెట్ పెడతామంటే ఆ సినిమాను వద్దని నిర్మొహమాటంగా చెప్పేస్తాడు బాలయ్య.

ఇక, తన రెమ్యునరేషన్ విషయంలో కూడా ఇంత కావాల్సిందే.! అని ఎప్పుడు డిమాండ్ చేయలేదు. అందుకే, ఇప్పటికీ బాలయ్య రెమ్యునరేషన్ 40 కోట్ల లోపే ఉంటుందని అంటుంటారు. అలాగే, మన మాస్ మహారాజ్ రవితేజ కూడా. తన మార్కెట్ పరిధి ఎంత మేరకు ఉందో అంతే బడ్జెట్ పెట్టమని చెప్తాడు. సినిమా పోతే రెమ్యునరేషన్ వదిలేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయట. ఇక, ఇటీవల వచ్చిన ఇరుముడి సక్సెస్‌తో నైజాం వాటాని మేకర్స్ రెమ్యునరేషన్‌గా ఇచ్చారట. దీని, విలువ ఎంత కాదన్నా 50 కోట్ల వరకూ ఉంటుందని టాక్ ఉంది.

అయితే, ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్స్ కి రవితేజ ఇరుముడి చిత్రానికి తీసుకున్నటే ఒక ఏరియా వాటా తీసుకుంటాడా లేక రెమ్యునరేషన్ వరకూ తీసుకొని పక్కకి జరుగుతాడా అనేది హాట్ టాపిక్‌గా మారింది. కొందరేమో ఇకపై చేసే సినిమాలకి కూడా షేర్ పద్ధతిలోనే మాట్లాడుకుంటున్నాడని అంటున్నారు. ఇంకొందరేమో..ప్రతీసారి అలా కుదరకపోవచ్చునని..కొత్త సినిమాకి గాను మన మాస్ మహారాజ్ 30 కోట్ల వరకూ తీసుకుంటున్నాడని చెప్తున్నారు. ఎలా, తీసుకున్నా రవితేజ వల్ల నిర్మాత లాస్ అంటే మాత్రం సైలెంట్‌గా ఉండడు..ఇది కన్‌ఫర్మ్.

#Ravi Teja#Irumudi#Dagudumuthala Dandakor#dil raju#Tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి