తెలంగాణ

TG : డోర్నకల్ ఎమ్మెల్యేకు తప్పిన పెనుప్రమాదం..

రచన: Kumar3 నిమిషాల పఠనం

డోర్నకల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే కారును పక్కకు ఆపినట్టు తెలిసింది. సెక్యూరిటీ సిబ్బంది సైతం కారు వద్దకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్టు సమాచారం.

డోర్నకల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే కారును పక్కకు ఆపినట్టు తెలిసింది. సెక్యూరిటీ సిబ్బంది సైతం కారు వద్దకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్టు సమాచారం.

వివరాల్లోకివెళితే..సెప్టెంబర్ 17న నిజాం పాలన నుంచి తెలంగాణకు స్వాతంత్ర్యం లభించడంతో నేడు అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.దీంతో నియోజకవర్గ ఎమ్మెల్యేలు జాతీయ జెండాను ఎగురవేసి ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో భాగస్వాములు అవుతున్నారు. ఈ క్రమంలోనే డోర్నకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్‌ సైతం ఆ వేడుకల్లో పాల్గొనేందుకు మహబూబాబాద్ వెళ్తున్నారు.

మార్గంమధ్యలో ఎమ్మెల్యే వాహనంలో ఉన్నట్టుండి పవర్ బ్యాంక్ పేలి మంటలు చెలరేగినట్లు తెలిసింది.ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. ఆ పవర్ బ్యాంక్ కారు డ్రైవర్‌దిగా సమాచారం.చింతపల్లి గ్రామ పరిసరాల్లో ఈ ప్రమాదం చోటుచేసుకోగా..వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎమ్మెల్యే రామచంద్రు నాయక్‌ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం మంటలు ఆర్పేశాక మరల ఆయన మహబూబాబాద్‌కు వెళ్లినట్టు తెలిసింది.

https://x.com/RTVnewsnetwork/status/2100468543502377036?s=20

కారులో మంటలు వచ్చిన సమయంలో సిబ్బంది అప్రమత్తత వల్లే పెను ప్రమాదం తప్పిందని సమాచారం.ఈ విషయం ఆయన అనుచరులకు తెలియడంతో కొంత ఆందోళనకు గురైనట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేకు ఏమీ కాకపోవడంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు. తమ ఎమ్మెల్యేకు పెను ప్రమాదం తప్పిందని తెలియడంతో నియోజకవర్గ ప్రజలు సైతం కొంత ఆందోళనకు గురవ్వగా.. జోరుగా చర్చ జరుగుతున్నట్టు సమాచారం.

#dornakal mla#fire in car#power bank blast#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి