The Paradise: చిన్న కథ, సింపుల్‌గా ఉంటే డ్రామా, మెలో డ్రామ చిత్రాలను రిలీజ్ చేయడంలో పెద్దగా ఇబ్బందులేమీ ఉండవు. పక్కా కమర్షియల్ సినిమా అయినా అంతే. కానీ, పాన్ ఇండియా సినిమా అన్నప్పుడే టెక్నికల్‌గా చాలా విషయాలలో అసలు కాంప్రమైజ్ కాకుండా సినిమాను రిలీజ్ చేయ్యాలి. లేదంటే, ఒక్క షోతోనే ఏళ్ళు కష్టపడి తీసిన శ్రమంతా వృధా అయిపోతుంది. సరైన ప్లానింగ్ లేక విడుదలైన సినిమాలు చాలా వరకూ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.
రిలీజ్ డేట్ అనేది సినిమాకి చాలా కీలలం. కథలో దమ్ముండి హీరో వరుస హిట్స్‌తో ఉంటే ఆ హైప్ వేరే లెవల్. ఎంత పెద్ద సినిమాతో పోటీ పడినా కూడా నెగ్గుకొస్తుంది. లేదంటే చిన్న సినిమా ముందు కూడా తేలిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో మన సినిమాలు రిలీజై ఫలితాన్ని ఆశించిన విధంగా కాకుండా ఇంకోలా చూడాల్సి వచ్చింది. అందుకే, మేకర్స్ సోలో డేట్స్ కోసమే ఆరాటపడుతుంటారు.
అయితే, అన్నీ సెట్ అయ్యాయి. ఇక థియేటర్స్‌లో దుమ్ము లేపడమే అనుకుంటున్న నాని సినిమా ది ప్యారడైజ్ కి మాత్రం మళ్ళీ రిలీజ్ విషయంలో ఇబ్బందులు తలెత్తినట్టుగా తెలుస్తోంది. వాస్తవానికి ఈ సినిమాను ఇదే నెల 24న పాన్ ఇండియా తరహాలో రిలీజ్ చేయడానికి డేట్‌ను కూడా అధికారికంగా ప్రకటించారు. మెల్లగా ప్రమోషన్స్ కూడా జరుగుతున్నాయి. ఇటీవల వచ్చిన 'ఏషనాగుల' సాంగ్ యూట్యూబ్‌లో తెగ ట్రెండవుతోంది.
అయితే, ఇప్పుడు ఓ వారం రోజుల పాటు ది ప్యారడైజ్ సినిమా వాయిదా పడబోతుందట. అంటే, అక్టోబర్ 1న రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో, దీనిపై క్లారిటీ రానుంది. ఇదే, జరిగితే..వెంకటేష్ కి ఇబ్బందే అనుకోవాలి. ఎందుకంటే, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆదర్శ కుటుంబం సినిమా అక్టోబర్ 2న రిలీజ్ చేస్తున్నట్టుగా నిర్మాత నాగవంశీ డబుల్ కన్‌ఫర్మేషన్ ఇచ్చాడు. మరి, నాని సినిమా రిలీజ్ విషయంలో మేకర్స్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో అనే ఆస్కతి ఇప్పుడు అందరిలోనూ ఉంది.











