సినిమా

Naga Vamsi: ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్ పోన్ అవుతుందా..నిర్మాత ఏమన్నారంటే!

రచన: Anshu4 నిమిషాల పఠనం

Naga Vamsi: వెంకటేష్, శ్రీనిధి శెట్టి జంటగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘ఆదర్శ కుటుంబం’. ఈ సినిమా విడుదల వాయిదా పడుతుందని ఇటీవల వార్తలు వచ్చి బాగా వైరల్ అవుతున్నాయి. దీనికి, చిత్ర నిర్మాత క్లారిటీ ఇచ్చారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. అయితే, తాజాగా నిర్మాత నాగవంశీ ఈ సినిమాను అక్టోబర్‌లోనే రిలీజ్ చేస్తున్నట్టుగా కన్‌ఫర్మ్ చేశాడు.

వరుస హిట్స్ మీద ఉన్న వెంకటేష్ మరోసారి కంప్లీట్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నాడు. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలకి కథ, మాటలు అందించిన గురూజీ ఇప్పుడు వెంకీని డైరెక్ట్ చేస్తూ ‘ఆదర్శ కుటుంబం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. టైటిల్ పోస్టర్ తోనే ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసిన త్రివిక్రమ్.. ఆ తర్వాత నాలుగు ప్రధాన పాత్రల పరిచయ వీడియోలను వదిలి అందరిలోనూ విపరీతమైన ఆసక్తిని రేకెత్తించాడు.

కాస్త సస్పెన్స్ కూడా ఉండబోతుందని టీజర్ చివరిలో హింట్ ఇచ్చాడు త్రివిక్రమ్. ఈ సినిమాలో నారా రోహిత్ చాలా ప్రత్యేకమైన పాత్రను చేస్తున్నాడు. అంతేకాదు, వెంకటేష్-రోహిత్ ల మధ్య వచ్చే సన్నివేశాలను ఎంతో క్యూరియాసిటీతో తీసినట్టుగా తెలుస్తోంది. ఇద్దరి మధ్య ఓ ప్రత్యేకమైన ట్రాక్ ఉంటుందని, అది చాలా ఇంటెన్సివ్ తో కూడుకుంటుందని చిత్ర యూనిట్ నుంచి అందిన సమాచారం. అయితే, రిలీజ్ విషయంలో చాలా రూమర్స్ వినిపించాయి.

దీనికి, తాజాగా చిత్ర నిర్మాత నాగవంశీ ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. అధికారికంగా ప్రకటించిన అక్టోబర్ 2నే ‘ఆదర్శ కుటుంబం’ భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుందని స్పష్టం చేసిన నాగవంశీ..సెప్టెంబర్ 2వ వారంలోనే టీజర్, దాని తర్వాత ఫస్ట్ సాంగ్, సెప్టెంబర్ చివరి వారంలో థియేట్రికల్ ట్రైలర్‌ ను రిలీజ్ చేస్తామని చెప్పాడు. వీటితో పాటు ఓ స్పెషల్ మ్యూజికల్ ఈవెంట్ ని కూడా ప్లాన్ చేసినట్లు ఎక్స్(X) వేదిక ద్వారా వెల్లడించారు. దీనితో, ‘ఆదర్శ కుటుంబం’ గురించి ఇప్పటి వరకూ వచ్చిన రూమర్స్ అన్నీ పటాపంచలయ్యాయి.

#Aadarsha Kutumbam Release Date#Venkatesh#Sriinidhi Setty#Trivikram
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి