తెలంగాణ

Telangana Investment: తెలంగాణకు భారీ పెట్టుబడి.. రూ.70వేల కోట్లతో దేశంలోనే అతిపెద్ద AI డేటా సెంటర్

రచన: NK3 నిమిషాల పఠనం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) రంగంలో తెలంగాణకు భారీగా పెట్టుబడులు తరలిరానున్నాయి. రాష్ట్రంలో అతిపెద్ద పెట్టుబడికి టీసీఎస్ తో ఒప్పందం కుదిరింది. సచివాలయంలో టీసీఎస్, హైపర్ వాల్ట్ కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు.

Telangana Investment: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో తెలంగాణకు భారీగా పెట్టుబడులు తరలిరానున్నాయి. రాష్ట్రంలో అతిపెద్ద పెట్టుబడికి టీసీఎస్ తో ప్రభుత్వం ఒప్పందం కుదిరింది. సచివాలయంలో టీసీఎస్, హైపర్ వాల్ట్ కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. దేశంలోనే అతి పెద్ద ఏఐ డేటా సెంటర్ ఏర్పాటునకు ఒప్పందం కుదుర్చుకున్నారు. హైదరాబాద్ లో దాదాపు రూ.70వేల కోట్లతో 250 ఎకరాల్లో 1 గిగా వాట్ సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 7వేల మందికి ఉపాధి అవకాశం లభించనుందని అధికారులు తెలిపారు.

సీఎం రేవంత్‌ సమక్షంలో టీసీఎస్ హైపర్‌వాల్ట్‌, ప్రభుత్వ ప్రతినిధులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఐటీ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఫ్యూచర్ సిటీకి అనుసంధానించే రోడ్డును రతన్ టాటాకు అంకితం ఇస్తున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. కొంగర కలాన్ నుంచి ప్యూచర్ సిటీకి ఇండియాలో బెస్ట్ రేడియల్ రోడ్లు నిర్మిస్తున్నామన్నారు.

#Telangana#Investment#AI Data Center#TCS#Cm Revanth Reddy#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి