ఏపీ

AP: 2029లోగా మరో 3 డీఎస్సీలు : మంత్రి లోకేశ్!

రచన: Mahesh4 నిమిషాల పఠనం

విజయవాడలోని ఏ కన్వెన్షన్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయ దినోత్సం సందర్భంగా ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు.

AP: విజయవాడలోని ఏ కన్వెన్షన్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయ దినోత్సం సందర్భంగా ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర విద్యా వ్యవస్థలో చేపడుతున్న సంస్కరణలు, డీఎస్సీ నియామకాలు, పాఠశాలల్లో తీసుకొస్తున్న మార్పులను ఆయన వివరించారు. డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియని వారు కూడా తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు తగులుతాయి. ఇప్పటివరకు 14 డీఎస్సీలు నిర్వహించిన వ్యక్తి సీఎం చంద్రబాబు. మా ప్రభుత్వాల హయాంలో దాదాపు రెండు లక్షల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశాం’’ అని నారా లోకేశ్ వెల్లడించారు. తమ ప్రభుత్వం ఏటా డీఎస్సీ నిర్వహించేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. 2029లోగా మరో మూడు డీఎస్సీలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

విద్యాశాఖలో అమలు చేస్తున్న సంస్కరణల ద్వారా ‘ఏపీ మోడల్’ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని నారా లోకేశ్ ఆకాంక్షించారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన 117 జీవో కారణంగా విద్యార్థులు పాఠశాలలకు దూరమయ్యారని ఆయన విమర్శించారు. ప్రస్తుతం మారుతున్న కాలానికి, విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా పాఠశాలల సిలబస్‌ను మార్చుతున్నామని తెలిపారు.

పిల్లలను గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దే అద్భుతమైన అవకాశం ఉపాధ్యాయులకే ఉందని లోకేశ్ అన్నారు. విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయడంలో టీచర్ల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. రాష్ట్ర విద్యా వ్యవస్థలో సమూలమైన సంస్కరణలు తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.

ఉపాధ్యాయులకు అంతర్జాతీయ స్థాయి అనుభవం కల్పించేందుకు విదేశాలకు పంపిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇతర దేశాల్లోని విద్యా విధానాలను అధ్యయనం చేసి, వాటిలోని మంచి విధానాలను రాష్ట్రంలో అమలు చేయాలని కోరుతున్నామని చెప్పారు. విద్యార్థులకు కేవలం పుస్తకాలకే పరిమితమైన విద్య కాకుండా ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ అందించాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే పిల్లలు సృజనాత్మకంగా ఆలోచించి అద్భుతాలు చేయగలరని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని నారా లోకేశ్ స్పష్టం చేశారు.

#Andhra Pradesh#AP Politics#Nara Lokesh#DSC#AP DSC#DSC Recruitment
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి