సినిమా

Shekar Master: జానీ మాస్టర్ భార్యపై శేఖర్ మాస్టర్ ఫిర్యాదు.. అసలు వివాదం ఏంటంటే?

రచన: Mahesh4 నిమిషాల పఠనం

జానీ మాస్టర్ భార్య సుమలత ఎలాంటి ఆధారాలు లేకుండా తన వ్యక్తిత్వాన్ని, మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం నన్ను తీవ్రంగా బాధించిందని ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన డాన్సర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు రఘు మాస్టర్, ఫెడరేషన్‌కు సుమలతతో పాటు సీనియర్ డాన్సర్ లక్ష్మిపై ఫిర్యాదు చేశారు.

Shekar Master: జానీ మాస్టర్ భార్య సుమలత ఎలాంటి ఆధారాలు లేకుండా తన వ్యక్తిత్వాన్ని, మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం నన్ను తీవ్రంగా బాధించిందని ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన డాన్సర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు రఘు మాస్టర్, ఫెడరేషన్‌కు సుమలతతో పాటు సీనియర్ డాన్సర్ లక్ష్మిపై ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జానీ మాస్టర్ భార్య సుమలత, సీనియర్ డాన్సర్ లక్ష్మి తన ప్రమేయం లేని విషయాల్లో ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని శేఖర్ మాస్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లు తన పుట్టుపూర్వోత్తరాల గురించి కూడా మాట్లాడారని ఆరోపించారు. ‘కక్కితే కాళ్ల మీద పడతాయి’ అంటూ తనపై నిందలు మోపుతూ వ్యంగ్యంగా, ఎటకారంగా మాట్లాడారని బాధపడ్డారు. వాళ్లు చేసిన ఇలాంటి కామెంట్స్ తనను తీవ్రంగా కలిచివేశాయని శేఖర్ మాస్టర్ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.

వాళ్ల కోసం ఎన్నో పాటలు వదులుకున్నా..

డాన్సర్స్ యూనియన్ సభ్యుల సంక్షేమం కోసం తాను ఎప్పుడూ ముందుంటానని ఈ సందర్భంగా శేఖర్ మాస్టర్ వెల్లడించారు. యూనియన్ సభ్యులకు పర్సంటేజ్ విషయంలో అన్యాయం జరుగుతోందని భావించిన సందర్భాల్లో తాను ఎన్నో పాటలను సైతం వదులుకున్నానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. డాన్సర్లకు న్యాయం జరగాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు.

పెద్దల సూచనతో మౌనం

పెద్దల సూచనతోనే ఈ వివాదంపై తాను ఇంతకాలం మీడియా ముందుకు రాకుండా మౌనం పాటించినట్లు శేఖర్ మాస్టర్ తెలిపారు. ఈ వ్యవహారంలో గొడవలు పెంచుకోవద్దని, మీడియా ముందుకు వెళ్లొద్దని పెద్దలు తనకు సూచించారని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. వారి మాటకు గౌరవం ఇచ్చే ఇప్పటివరకు ఈ అంశంపై బహిరంగంగా స్పందించలేదన్నారు. అయితే సుమలత వ్యవహరించిన తీరు తనను తీవ్రంగా బాధించడంతోనే ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని వెల్లడించారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సుమలత, సీనియర్ డాన్సర్ లక్ష్మి ఇద్దరూ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని శేఖర్ మాస్టర్ డిమాండ్ చేశారు. తాజా వ్యవహారంపై డాన్సర్స్ అసోసియేషన్, ఫెడరేషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటాయన్నది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

#Shekar Master#Jani Master#Sumalatha#Lakshmi Choreographer
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి