సినిమా

Vaishnavi Chaitanya: అప్పుడు అవమానించారు..ఇప్పుడు హీరోయిన్ అంటున్నారు!

రచన: Anshu4 నిమిషాల పఠనం

Vaishnavi Chaitanya: సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్స్ కి మాత్రమే కాదు..26 శాఖలలో ఉన్న వాళ్ళు కూడా కెరీర్ ప్రారంభంలోనో..మధ్యలో డౌన్ ఫాల్ అయితేనో...ఫ్లాపులొచ్చి గ్రాఫ్ పడిపోతేనో అవమానించకుండా ఎవరూ ఉండరు. అసలు, ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో నిలబడాలంటే చచ్చి బ్రతకాలి. చిరంజీవి, రజినీకాంత్ లాంటి వారికి కూడా అవమానాలు తప్పలేదు.

అలాంటిది, ఇక మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. తాజాగా, ఇలాంటి కష్టాలను, అవమానాలను భరించింది ఇప్పటి క్రేజీ బ్యూటీ..తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య. సినిమా మీద ఆసక్తితో, నటిగా ఇక్కడ నిలబడాలని వచ్చి ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగింది. అవకాశాల కోసం ఎంతో మందిని అడిగింది. షార్ట్ ఫిలింస్ కూడా చేసింది. యాక్టింగ్ పరంగానూ మంచి నటి అని కూడా అనిపించుకుంది.

అయినా, సిల్వర్ స్క్రీన్ మీద కనిపించడానికి మాత్రం చాలా కష్టాలు పడింది. అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో లాంటి బ్లాక్ బస్టర్స్‌లో చిన్న చిన్న పాత్రలు చేసింది. అలా, ఇండస్ట్రీలో కాస్త గుర్తింపు తెచ్చుకొని బేబీ సినిమాతో హీరోయిన్‌గా నిరూపించుకుంది. ఈ సినిమాతో వచ్చిన గుర్తింపుతో గూగుల్ కూడా తన ప్రొఫైల్‌ను తీసుకుంది. కానీ, అక్కడ కనిపించలేదని ఓ వ్యక్తి అన్న మాటలు ఇప్పటికీ వైష్ణవి చెవిలో మోగుతూనే ఉన్నాయి..మనసులో కదులుతూనే ఉన్నాయి.

సినిమా అవకాశం కోసం వెళితే..నువ్వు ఎవరు..? ఏం చేశావు..గూగుల్ సర్చ్ చేస్తే నీపేరు వస్తుందా..? ఇలా చాలా చులకనగా మాట్లాడి అవమానించాడట. ఇప్పుడు ఆ వ్యక్తే తనని హీరోయిన్ అంటున్నాడు. ఇప్పటి సక్సెస్ కి ఆరోజు పడిన అవమానాలే కారణం.. అని వైష్ణవి చైతన్య తాజా చిత్రం ఎపిక్ ప్రమోషన్స్‌లో చెప్పి ఎంతో ఎమోషనల్ అయింది. ప్రస్తుతం తన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక, ఈ సినిమాలో మరోసారి ఆనంద్ దేవరకొండతో కలిసి అలరించబోతోంది.

#Vaishnavi Chaitanya#Epic#Anand Devarakonda#Baby
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి