తెలంగాణ

TG Politics: ప్రజల్లోకి అన్ని పార్టీలు.. హీటెక్కుతున్న తెలంగాణ రాజకీయాలు

రచన: Mahesh5 నిమిషాల పఠనం

తెలంగాణలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ.. మూడు పార్టీలు ఒకేరోజు ప్రజల్లోకి దిగి పరస్పర విమర్శలతో హీట్ పెంచాయి. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విపక్షాలు మాట్లాడితే.. తమ పాలనను ఎలివేట్ చేస్తూ అధికార కాంగ్రెస్ పార్టీ కౌంటర్ అటాక్‌కి దిగడంతో రాష్ట్రంలో పొలిటికల్ ఫైట్ మరింత రసవత్తరంగా మారింది.

TG Politics: తెలంగాణలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ.. మూడు పార్టీలు ఒకేరోజు ప్రజల్లోకి దిగి పరస్పర విమర్శలతో హీట్ పెంచాయి. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విపక్షాలు మాట్లాడితే.. తమ పాలనను ఎలివేట్ చేస్తూ అధికార కాంగ్రెస్ పార్టీ కౌంటర్ అటాక్‌కి దిగడంతో రాష్ట్రంలో పొలిటికల్ ఫైట్ మరింత రసవత్తరంగా మారింది. శనివారం రాష్ట్రంలో జరిగిన మూడు పార్టీల కార్యక్రమాలు.. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలు మరింత హీట్ ఎక్కబోతున్నాయనే సంకేతాలు ఇచ్చినట్లు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కరీంనగర్‌లో బీఆర్ఎస్ యువ సమరభేరీ

కరీంనగర్‌లో నిర్వహించిన యువ సమరభేరీలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేయడాన్ని ప్రశ్నించారు. నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించిన ఆయన.. నోటిఫికేషన్ల పేరుతో ‘లూటిఫికేషన్’ జరుగుతోందంటూ మండిపడ్డారు. ఒక్క మంత్రిని కాదు.. త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వాన్నే ప్రజలు బర్తరఫ్ చేస్తారని వ్యాఖ్యానించారు.

హైదరాబాద్‌లో బీజేపీ మహాధర్నా

మరోవైపు హైదరాబాద్‌లో బీజేపీ నిర్వహించిన మహాధర్నాలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండింటినీ టార్గెట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 22ఏ నిషేధిత జాబితా పేరుతో ప్రజల భూములను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం భూములు అమ్మడమేనని విమర్శించారు.

నకిరేకల్ సభలో సీఎం కౌంటర్

ఇక ఈ రోజు నకిరేకల్ సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌పై ఎదురుదాడికి దిగారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావిస్తూ.. తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆయన ప్రజలకు వివరించారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో సిరిసిల్ల, సిద్దిపేటలోనూ కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మొత్తంగా.. మూడు ప్రధాన పార్టీలు ఒకేరోజు ప్రజల్లోకి రావడం, పరస్పర విమర్శలకు దిగడంతో తెలంగాణ రాజకీయాల్లో రాబోయే ఎన్నికల వేడి కొంచెం ముందుగానే మొదలైనట్లుగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే ఎన్నికల నాటికి ఈ వేడి మరింత పెరిగే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయని వారు చెబుతున్నారు.

#Telangana Politics#TG Politics#Telangana Congress#BRS#BJP Telangana
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి