తెలంగాణ

TG Politics: రేవంత్ - రాజగోపాల్ రెడ్డి మంతనాలు.. మంత్రి పదవి ఖాయమేనా?

రచన: Mahesh4 నిమిషాల పఠనం

తెలంగాణ రాజకీయాల్లో తాజాగా ఓ ఆసక్తికర సీన్ చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. నకిరేకల్ సభలో మాత్రం అందుకు భిన్నంగా కనిపించారు. సీఎం రేవంత్ రెడ్డి పక్కనే కూర్చొని ఆయనతో పదేపదే మాట్లాడుతూ కనిపించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు..

TG:తెలంగాణ రాజకీయాల్లో తాజాగా ఓ ఆసక్తికర సీన్ చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. నకిరేకల్ సభలో మాత్రం అందుకు భిన్నంగా కనిపించారు. సీఎం రేవంత్ రెడ్డి పక్కనే కూర్చొని ఆయనతో పదేపదే మాట్లాడుతూ కనిపించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు.. తన ప్రసంగం ప్రారంభంలో రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరును ప్రస్తావించగానే సభలో కాంగ్రెస్ కార్యకర్తలు ఈలలు, అరుపులతో హోరెత్తించారు. దీంతో సీఎం కాసేపు తన ప్రసంగాన్ని నిలిపివేయాల్సి వచ్చింది.

ఇటీవల వరకు రేవంత్ ప్రభుత్వ నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, కొన్ని సందర్భాల్లో సీఎంపైనే నేరుగా విమర్శలు చేసిన నేతగా రాజగోపాల్ రెడ్డి పేరు వినిపించింది. అలాంటి నేత ఇప్పుడు సీఎంతో ఇంత సన్నిహితంగా కనిపించడం వెనుక రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా? అనే చర్చ మొదలైంది.

ముఖ్యంగా ఇటీవల చోటుచేసుకున్న మాజీ మంత్రి కొండా సురేఖ వ్యవహారం కూడా ఈ చర్చకు మరింత ఊతమిస్తోంది. కొండా దంపతులకు రాజగోపాల్ రెడ్డి మద్దతు ఉందనే వాదనలు అప్పట్లో రాజకీయ వర్గాల నుంచి వినిపించాయి. కొండా సురేఖ కుమార్తె సుష్మిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సురేఖ మంత్రి పదవిని కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల మధ్య త్వరలో తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉండొచ్చనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలోనే రాజగోపాల్ రెడ్డి పేరు మంత్రి పదవి రేసులో వినిపిస్తోంది. తాజాగా నకిరేకల్ సభలో రేవంత్‌తో ఆయన కనిపించిన తీరు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది.

అయితే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఖరారైందనే విషయంపై అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. సీఎం రేవంత్ రెడ్డితో ఆయన సాన్నిహిత్యం కేవలం రాజకీయ మర్యాద మాత్రమేనా.. లేక కేబినెట్ విస్తరణకు ముందు జరిగిన కీలక మంతనాలా అన్నది మాత్రం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చగా మారింది. చూడాలి మరి ఎప్పటి నుంచో మంత్రి కావాలని కలలు కంటున్న రాజగోపాల్ రెడ్డికి ఈ సారి అదృష్టం కలిసి వస్తుందా లేదా అనేది.

#Telangana Politics#Revanth Reddy#Komatireddy#Rajagopal Reddy#Telangana Congress#Congress MLAs
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి