తెలంగాణ

కాస్కో.. కేసీఆర్.. 100 సీట్లు పక్కా.. మళ్లీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే- సీఎం రేవంత్ రెడ్డి

రచన: NK3 నిమిషాల పఠనం

Cm Revanth: నకిరేకల్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి చెలరేగిపోయారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు టార్గెట్ గా విరుచుకుపడ్డారు. మళ్లీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాస్కో కేసీఆర్.. ఇదే నా సవాల్ అంటూ ఆవేశంగా మాట్లాడారు.

Cm Revanth Vs Kcr: నకిరేకల్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి చెలరేగిపోయారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు టార్గెట్ గా విరుచుకుపడ్డారు. కాస్కో కేసీఆర్.. వచ్చే ఎన్నికల్లో దేక్ లేంగే కేసీఆర్.. ఇదే నా సవాల్.. అంటూ ఆవేశంగా మాట్లాడారు. మళ్లీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

'' ఇకపై ఆషామాషీగా ఉండదు. ఆనాడు పెద్దలు జానారెడ్డి, జైపాల్ రెడ్డి లాంటోళ్లు ఈ దుర్మార్గులతో మనకెందుకు అని అనుకున్నారు. కానీ, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అలా అనుకోరు. దెబ్బకు దెబ్బ తీస్తారు. ఎవరూ వెనక్కి తగ్గరు. జీవితాంతం గుర్తుంచుకోండి. మా కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలు మిమ్మల్ని భూస్థాపితం చేస్తారు. వచ్చే ఎన్నికల్లో చూసుకుందాం కేసీఆర్.. ఇదేనా సవాల్'' అని రేవంత్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలిచి చూపిస్తామన్నారు.

''కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గుండె ధైర్యంతోనే సూటిగా కేసీఆర్, బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసురుతున్నా. సీట్లు పెరిగితే 117.. ఉన్న సీట్లే ఉంటే 90 సీట్లతో గెలుస్తాం. 2029లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. పదేళ్లు మావే.

94 నుంచి 2004 వరకు రెండుసార్లు తెలుగుదేశం అధికారంలో ఉంది. 2004 నుంచి 2014 వరకు రెండుసార్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. 2014 నుంచి 2023 వరకు రెండుసార్లు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. 2024 నుంచి 2034 వరకు రెండుసార్లు ఇందిరమ్మ రాజ్యం, కాంగ్రెస్ పాలన ఉంటుంది. ప్రజా సంక్షేమాన్ని అమలు చేస్తాం. ఇదేనా సవాల్.. కేసీఆర్ సిద్ధంగా ఉండు. అసెంబ్లీకి రా.. లేదా గౌవరంగా రాజీనామా చేయ్. గజ్వేల్ లోనే తేల్చుకుందాం'' అని సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి.

#Cm Revanth#Kcr#Brs#Telangana Politics#Nakrekal#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి