తెలంగాణ

Revanth Reddy: ఉచిత బస్సు ‎పై సీఎం రేవంత్ రెడ్డి కీలకవ్యాఖ్యలు!..

రచన: Venu3 నిమిషాల పఠనం

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా సంక్షేమమే లక్ష్యంగా పలు కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తోంది. అందులో ఉచిత బస్సు ప్రయాణం అత్యంత ప్రజాదరణ పొందిన పథకాలలో ఒకటిగా కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది.

తెలంగాణ రాజకీయాల్లో మహిళా ఓటు మరోసారి కీలక చర్చగా మారుతోంది. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కొనసాగింపుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు మహిళలకు ఉచిత బస్సు పథకం కొనసాగుతుందని సీఎం స్పష్టం చేశారు.

నకిరేకల్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి అనంతరం జరిగిన బహిరంగ సభలో మహిళా సంక్షేమంపై ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రస్తుతం కోట్లాది మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారని పేర్కొన్న ఆయన.. ఈ పథకాన్ని చూసి కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు.

ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేయాలనే ఉద్దేశంతో ఆటో డ్రైవర్లను కొందరు రెచ్చగొడుతున్నారని సీఎం ఆరోపించారు.. అలాగే మహిళలకు పెట్రోల్ బంకుల నిర్వహణ, సోలార్ ప్రాజెక్టుల నిర్వహణలో భాగస్వాములను చేస్తున్నట్టు పేర్కొన్నారు.. అదేవిధంగా మహిళలను ఆర్థికంగా స్వావలంబన దిశగా తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలన్నది తమ లక్ష్యమని వివరించారు..

మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా సంక్షేమమే లక్ష్యంగా పలు కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తోంది. అందులో ఉచిత బస్సు ప్రయాణం అత్యంత ప్రజాదరణ పొందిన పథకాలలో ఒకటిగా కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. ఎన్నికల్లో మహిళా ఓటర్లు కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో వారి మద్దతును మరింత బలపరుచుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. సంక్షేమంతో పాటు ఉపాధి, ఆర్థిక అవకాశాలు, స్వయం ఉపాధి రంగాల్లో మహిళలకు అవకాశాలు పెంచడం ద్వారా రాజకీయ మద్దతును కూడబెట్టుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

#telangana#CM Revanth Reddy#free bus#Nakrekal#Womens
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి