సినిమా

The Paradise: లైఫ్ లో మొదటిసారి పెద్ద రిస్క్ చేస్తున్న నాని!

రచన: Anshu4 నిమిషాల పఠనం

The Paradise: న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు జడల్ పాత్రలో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటడానికి రెడీ అవుతున్నాడు. దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో నాని చేస్తున్న ఈ ప్రయోగం మీద భారీ అంచనాలున్నాయి. ఎంతో ప్రెస్టీజియస్ చిత్రంగా ‘ది ప్యారడైజ్’ తెరకెక్కుతుండగా, సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలకి సిద్ధమవుతోంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు, సినీ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మొత్తానికి ఈ సినిమా విడుదలకు ఇంకో వారం రోజులు మాత్రమే ఉంది. దీంతో, అభిమానుల్లో ఈ ప్యారడైజ్ సినిమాపై అంచనాలు తారా స్థాయిలో పెరిగిపోయాయి. అయితే, ఇప్పుడు యూనిట్ మొత్తం నిద్రాహారాలు మాని మరీ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమై ఉన్నారు.

కాగా, ఈ సినిమా ఇదేనెల 23న పెయిడ్ ప్రిమియర్స్, 24న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. రిలీజ్ కి ఇంకా కేవలం వారం రోజులే సమయం ఉండటంతో యూనిట్ అంతా.. పోస్ట్ ప్రొడక్షన్, రీ-రికార్డింగ్, ప్యాచ్ వర్క్ పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉంది. శ్రీకాంత్ ఓదెల మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌తో కలిసి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పూర్తి చేస్తున్నాడు. దీంతో, హీరో నాని స్వయంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మీద దృష్టి పెట్టాడు.

ఇక, ప్యారడైజ్ సినిమాకి ట్రైలర్ ఏదీ రిలీజ్ చేయడం లేదని చిత్రయూనిట్ ప్రకటించడం కూడా పెద్ద ఛాలెంజ్ గా మారింది. అందరూ పోస్ట్ ప్రొడక్షన్ పనుల ఒత్తిడి వల్ల పూర్తి స్థాయిలో సినిమాకి ప్రమోషన్లు చేయడం చాలా కష్టమైనప్పటికీ, డిజిటల్ ప్రమోషన్లతో పాటు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌పైనే హీరో నాని అండ్ టీమ్ పూర్తిగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

నాని ఒకవైపు అవుట్‌పుట్ ఎలా వస్తుందో చూసుకుంటూనే, మరోవైపు ప్రమోషన్లను ఎలా ప్లాన్ చేయాలో స్కెచ్ వేస్తున్నాడు. మరి, ఇంత ఒత్తిడిలో నాని సినిమాను ఏ విధంగా నిలబెడతాడో చూడాలి. ఇప్పటికే, అడ్వాన్స్ బుకింగ్స్‌ కూడా స్టార్ట్ అయ్యాయి. కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గే అవకాశమే లేదు.

#nani#the paradise#kayadu lohar#Srikanth odela#keerthy suresh
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి