Dharman: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ జైలర్ 2 విడుదల కోసం అభిమనులే కాదు, యావత్ సినీ లవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జైలర్ భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో సీక్వెల్ మీద భారీ అంచనాలున్నాయి. నెల్సన్ దిలీప్‌కుమార్ రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ కామెడీ చిత్రాన్ని అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కలానిధి మారన్ నిర్మించారు.
ఈ మూవీలో, రమ్య కృష్ణన్, యోగి బాబు, మీర్నా, రిత్విక్ సీక్వెల్ లోనూ కంటిన్యూ అవుతున్నారు. ఎస్. జె. సూర్య విలన్‌గా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాను అక్టోబర్ 15న భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాను ఇలా పూర్తి చేసిన రజినీ..ఆ వెంటనే యంగ్ డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రజనీకాంత్ ధర్మన్ చిత్రాన్ని చేస్తున్నారు. ఈ సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుతున్నారు.
ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ధర్మన్.. తాజాగా మూడో షెడ్యూల్ ప్రారంభించినట్టుగా దర్శకుడు ఓ వీడియోను ఎక్స్ ద్వారా ఫ్యాన్స్ కి అప్డేట్ ఇచ్చాడు. ఇక, ఈ షూట్ షెడ్యూల్ లో రజనీకాంత్ అలాగే బబ్లీ బ్యూటీ, యంగ్ హీరోయిన్ రాశీఖన్నా పాల్గొంటున్నారు. వీరిపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సో మొత్తం మీద ధర్మన్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ 2027 సంక్రాంతి బరిలో దిగడానికి రెడీ అవుతున్నారు.
ఇక ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్షేషన్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. కాగా, యూనివర్సల్ హీరో కమల్ హాసన్, రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ పతాకంపై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక, ఇదే సినిమాలో మన టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని విలన్ రోల్ లో నటిస్తున్నాడు. అయితే, ఇంకా ఈ విషయంలో మేకర్స్ నుంచి అఫీషీయల్ గా ఎలాంటి కన్‌ఫర్మేషన్ లేదు. అటు రాపో నుంచి కూడా హిట్ రాలేదు. మొత్తానికి, సూపర్ స్టార్ ఈ ఏజ్‌లో కూడా యంగ్ హీరోల కంటే దూకుడుగా సినిమాలను చేస్తుండటం విశేషం.











