Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ వైడ్‌గా ఎంతటి క్రేజ్ సంపాదించుకున్నాడో అందరికీ తెలిసిందే. కానీ, ఆ తర్వాత వచ్చిన రెండు సినిమాలు ఆ స్థాయిలో విజయాన్ని అందివ్వలేకపోయాయి. వాస్తవానికి, రాజమౌళి సినిమాతో హిట్ కొట్టిన హీరోలకి తర్వాత సినిమా ఫ్లాప్ పడుతుందని అన్న మాట తారక్, చరణ్‌ల విషయంలోనూ నిజమైంది.
అంతకముందు వచ్చిన గేమ్ ఛేంజర్, ఇటీవల వచ్చిన ‘పెద్ది’ సినిమాలతో ఆశించిన సక్సెస్ దక్కలేదనే అంటున్నారు. దీంతో నెక్స్ట్ సినిమాను పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే సుకుమార్ దర్శకత్వంలో చరణ్ తన 17వ సినిమాను చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ దసరా పండుగ సందర్భంగా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రాజెక్ట్‌ను లాంచ్ చేయనున్నట్టుగా సమాచారం.
అయితే, చరణ్ మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఇప్పుడు తాజా వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అతనెవరో కాదు ప్రభాస్‌తో ‘ఆదిపురుష్’ తీసిన దర్శకుడు ఓం రౌత్. ఆయన దర్శకత్వంలో రామ్ చరణ్ త్వరలో ఓ సినిమాను ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. రీసెంట్‌గానే ఓం రౌత్.. రామ్ చరణ్‌కు ఓ కథను వినిపించాడట. అది, బాగా నచ్చి చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం.
హిందీలో వచ్చిన ‘తానాజీ’, ఆ తర్వాత వచ్చిన పాన్ ఇండియా సినిమా ‘ఆదిపురుష్’ లతో ఓం రౌత్ మంచి ఫిల్మ్ మేకర్స్‌గా పేరు సంపాదించుకున్నాడు. ఆదిపురుష్ ఆశించిన విజయాన్ని అందుకోకపోయినా కూడా మేకింగ్ పరంగా మాత్రం ప్రశంసలు అందుకున్నాడు. ఈ బాధ్యతతోనే రామ్ చరణ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఓ పవర్‌ఫుల్ స్టోరీని రెడీ చేశాడట. పీరియాడిక్ హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా ఈ కథను తయారు చేసినట్టుగా సమాచారం. మరి, ఈ ప్రాజెక్ట్‌కి సంబందించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఎప్పుడొస్తుందో చూడాలి.








