సినిమా

Prashanth Neel: డ్రాగన్..ఫిబ్రవరి టార్గెట్ రీచ్ అవకపోతే..లెక్కలన్నీ మారిపోతాయ్!

రచన: Anshu4 నిమిషాల పఠనం

Prashanth Neel: మాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న డ్రాగన్‌ సినిమాను 2027, జూన్ 11వ తేదీన రిలీజ్ చేయబోతున్నామని నిర్మాతలు ఇంతకముందే డేట్ ని కూడా ప్రకటించారు. ఈ మధ్యలోనే ఎన్టీఆర్ భుజానికి గాయం కావడంతో డ్రాగన్ షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో రిలీజ్ డేట్ మారుతుందనే ప్రచారం మొదలైంది.

Prashanth Neel: మాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న డ్రాగన్‌ సినిమాను 2027, జూన్ 11వ తేదీన రిలీజ్ చేయబోతున్నామని నిర్మాతలు ఇంతకముందే డేట్ ని కూడా ప్రకటించారు. ఈ మధ్యలోనే ఎన్టీఆర్ భుజానికి గాయం కావడంతో డ్రాగన్ షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో రిలీజ్ డేట్ మారుతుందనే ప్రచారం మొదలైంది.

ఇటీవల వచ్చిన రవితేజ ఇరుముడి సక్సెస్ ఈవెంట్‌లో నిర్మాతలలో ఒకరైన యలమంచిలి రవిశంకర్ మాత్రం రెండు వారాల్లో షూటింగ్ మళ్లీ మొదలవుతుందని, ఫిబ్రవరి వరకు డ్రాగన్ హూటింగ్ మొత్తం పూర్తి చేస్తామని వెల్లడించారు. అంతేకాదు, ఇప్పటి వరకూ అనుకున్నట్టుగానే 2027 జూన్‌లోనే ఈ సినిమాను పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేస్తామని మరోసారి క్లారిటీ ఇచ్చారు.

అయితే, ఇప్పుడు మరో కొత్త ప్రచారం మొదలైంది. షూటింగ్ అనుకున్నట్టుగా జరగడం లేదట. ప్రశాంత్ నీల్ జూన్ లో చెప్పిన డేట్ కి సినిమాను రిలీజ్ చేయడం సాధ్యపడదని. దీంతో, 2027 దసరా వరకు పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందంటూ వార్తలు ప్రసారం అవుతున్నాయి. కానీ, ఇంకా దీనిపై మైత్రీ నుంచి గానీ, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ నుంచి గానీ కొత్తగా ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. ప్రస్తుతం అధికారికంగా ఉన్న డేట్ మాత్రం జూన్ 11 అనే యూనిట్ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం.

అయితే, ఇలా రిలీజ్ డేట్ విషయంలో సందేహాలు తలెత్తడానికి కారణాలు లేకపోలేదు. ఎన్టీఆర్ కి గాయం అయి సర్జరీ కారణంగా ఆయన 6 నుంచి 8 వారాల పాటు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. అంటే ఎంత కాదన్నా రెండు నెలలపాటు షూటింగ్ షెడ్యూల్స్ మొత్తం డిస్ట్రబ్ అయ్యాయి. ఆ గ్యాప్ ఫిలప్ చేయాలంటే చాలా కష్టం. కాబట్టి, ఈ రెండు నెలల ప్రభావం గట్టిగానే పడుతుందని..దానివల్లే విడుదల వాయిదా పడుతుందని వార్తలు పుట్టుకొచ్చాయి.

అయితే, రెండు నెలల షూటింగ్‌కి అంతరాయం కలిగినా కూడా ప్రశాంత్ నీల్ మాత్రం డే అండ్ నైట్ షూట్స్..పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్‌ని జేట్ స్పీడ్‌లో చేయడానికి ప్లాన్ చేసి ఉన్నట్టుగా తెలుస్తోంది. లేదంటే, ఓటీటీ సంస్థ నుంచి ఒత్తిడి బాగా పెరిగిపోతుంది. ఇతర, సినిమాలతో పోటీ ఉంటుంది. బడ్జెట్ లెక్కల్లోనూ చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. కాబట్టి, మేకర్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న తేదీకి సినిమాను రిలీజ్ చేయాల్సి. కానీ, ఇక్కడ ఒక సమస్య కూడా ఉంది. ప్రశాంత్ నీల్ పోస్ట్ ప్రొడక్షన్‌కి వీఎఫెక్స్ కి ఎక్కువ సమయం తీసుకుంటాడు. చూడాలి, మరి ఏం జరగనుందో.

#Prashanth Neel#NTR#Dragon#Rukmini Vasanth
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి