తెలంగాణ

బీఆర్ఎస్‌తో డీల్ కుదుర్చుకోవడానికే ఈ డ్రామాలు- సీఎం రేవంత్‌పై బీజేపీ ఫైర్

రచన: NK6 నిమిషాల పఠనం

సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నేతలు మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ధరణి పేరుతో లక్షల కోట్ల దోపిడీ జరిగిందంటున్న సీఎం రేవంత్ రెడ్డి.. వాటిని ఎందుకు బయటపెట్టలేకపోతున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. దోపిడీదారులు, కుట్రదారులు ఎవరో బహిర్గతం చేయాలని ఆయన సీఎం రేవంత్ ను డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలపై విమర్శలు, ఆరోపణలు చేయడం తప్ప.. ఆధారాలు చూపడం లేదని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని ఆయన ఆరోపించారు.

Alleti Maheshwar Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నేతలు మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ధరణి పేరుతో లక్షల కోట్ల దోపిడీ జరిగిందంటున్న సీఎం రేవంత్ రెడ్డి.. వాటిని ఎందుకు బయటపెట్టలేకపోతున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. దోపిడీదారులు, కుట్రదారులు ఎవరో బహిర్గతం చేయాలని ఆయన సీఎం రేవంత్ ను డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలపై విమర్శలు, ఆరోపణలు చేయడం తప్ప.. ఆధారాలు చూపడం లేదని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని ఆయన ఆరోపించారు.

''గత సర్కార్ లో లక్షల కోట్ల దోపిడీ జరిగిందని సీఎం అంటున్నారు. మరి ఆ దోపిడీ ఎక్కడ జరిగిందో ఎందుకు బయటపెట్టడం లేదు? ఎందుకు పబ్లిక్ డొమైన్ లో పెట్టడం లేదు? దానికి ప్రజలకు సమాధానం చెప్పాలి. గత ప్రభుత్వంలో ఏ రకంగా దోపిడీ జరిగిందో, ఆ దోపిడీదారులు ఎవరు? ఆ కుట్రదారులు ఎవరు? బయటపెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ మూడున్నర గంటల సేపు అసెంబ్లీలో సుదీర్ఘంగా మాట్లాడారు. కానీ, ఈ అంశాలేవీ ఎందుకు చెప్పలేదు?

రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన దోపిడీకి మీరు వత్తాసు పలుకుతున్నారా? గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీకి.. మీరు ఇవాళ చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారు తప్ప మరొకటి కాదు. మీకు చిత్తశుద్ధి ఉంటే గత ప్రభుత్వంలో చేసిన లక్షల కోట్ల రూపాయల దోపిడీని బట్టబయలు చేయండి. సిట్టింగ్ జడ్జితో దీని మీద పెద్ద ఎత్తున జుడీషియల్ విచారణ జరిపించాలని మేము కోరితే అలా చేయకుండా గతంలో ఉన్న సిట్‌నే సెట్ (స్పెషల్ ఎంక్వైరీ టీమ్) అంటున్నారు. సెట్ పోయి సెట్టింగ్ అవుతుంది. ఈ సెట్టింగ్ ఏందో.. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఉన్న చీకటి ఒప్పందం ఏందో బయటకు రావాలి'' అని ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.

బీఆర్ఎస్‌తో డీల్ కుదుర్చుకోవడానికే.. రేవంత్ డ్రామాలు- బండి సంజయ్

సీఎం రేవంత్ పై కేంద్రమంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ భూ దోపిడీ అంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన బండి సంజయ్.. బీఆర్ఎస్ తో డీల్ కుదుర్చుకోవడానికే రేవంత్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.

''బీఆర్ఎస్ నేతలు వేల ఎకరాల భూమి కబ్జా చేశారని చెప్పడానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి వెయ్యి రోజులు పట్టిందా? అంటే ఇన్ని రోజులు రేవంత్ కి, కేసీఆర్ కుటుంబానికి డీల్ కుదరలేదు. ఇప్పుడు ఏఐసిసికి ఈఎంఐ కట్టాలి. కాబట్టి కొత్త స్కీమ్ ని సీఎం రేవంత్ అసెంబ్లీ వేదికగా స్టార్ట్ చేశారు. నాకు ఇచ్చే పైసలు పెంచండి అంటూ డైరెక్ట్ గా బీఆర్ఎస్ పార్టీకి సీఎం రేవంత్ ఒక ఆఫర్ ఇస్తున్నారు.

ప్రతి అసెంబ్లీ సమావేశంలో ఏదో ఒకటి బయటపెడతారు. ఫస్ట్ సిట్ అన్నారు అసెంబ్లీ వేదికగా. నెక్ట్స్ సీఐడీ ఇన్వెస్టిగేషన్ అన్నారు. ఇప్పుడు సెట్ అంటున్నారు. సెట్టింగ్ చేసుకోవడానికి సెట్ అంటున్నారు. స్పెషల్ ఎంక్వైరీ టీమ్ అట. దేనికోసం ఈ సెట్? మళ్లీ ఏదో టైమ్ పాస్. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఒకరినొకరు తిట్టుకుంటారు.. ప్రజలను పిచ్చోళ్లను చేస్తారు. అంతకుమించి ఏమీ కాదు. ఆరు గ్యారెంటీల గురించి మర్చిపోతారు. ఎన్నికల అఫిడవిట్ లో కేసీఆర్ కుటుంబం తమ ఆస్తిపాస్తుల వివరాలు ఏమేం చూపింది, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఏమేం గుర్తించింది? దీని మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోండి'' అని సీఎం రేవంత్ ను డిమాండ్ చేశారు కేంద్రమంత్రి బండి సంజయ్.

#Alleti Maheshwar Reddy#Bjp#Telangana#Cm Revanth Reddy#Kcr#Congress#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి