సినిమా

Adivi Sesh: మొత్తానికి గూఢాచారి 2 (G2) రిలీజ్ డేట్ వచ్చేసింది..

రచన: Anshu4 నిమిషాల పఠనం

Adivi Sesh: టాలీవుడ్ యంగ్ హీరోలలో అడవి శేష్ ది ఒక సపరేట్ ఇమేజ్..సపరేట్ జర్నీ. అయన సినిమాలన్నీ ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. ముందు నుచ్ణి శేష్ కి కథలపై మంచి పట్టుంది. స్క్రీన్ ప్లే కూడా బాగా రాయగలడు. మేకింగ్ విషయంలోనూ అడవి శేష్ చాలా క్లారిటీగా ఉంటాడు. ఇంత క్లారిటీ ఉన్నప్పటికీ అడవి శేష్ నుంచి వచ్చే సినిమాలు చాలా గ్యాప్ తీసుకుంటున్నాయి. మొత్తానికి జీ2 రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు.

అడవి శేష్ కెరీర్‌లో గూఢాచారి చాలా ప్రత్యేకమైన సినిమా. ఈ సినిమాతో శేష్ బాక్సాఫీస్ వద్ద మంచి కమర్షియల్ సక్సెస్‌ను అందుకుంది. క్షణం, గూఢాచారి, మేజర్ లాంటి సినిమాలు అడవి శేష్ మార్కెట్‌ను బాగా పెంచాయి. అయితే, కమర్షియల్ హీరోగా మాత్రం ఆశించిన స్థానాన్ని సంపాదించుకోలేకపోతున్నాడు. అయినా, శేష్ సినిమాలకి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది.

ఇటీవల వచ్చిన డెకాయిట్ కూడా అడవి శేష్‌ను బాగా డిసప్పాయింట్ చేసింది. కథ, కథనాలు బాగా ఉన్నప్పటికీ..వాటిని తెరపైకి తీసుకురావడంలో మాత్రం దర్శకుడు కొంత రాంగ్ స్టెప్ వేశాడు. చెప్పాలంటే, ఇది శేష్ సినిమా అని కూడా చాలామంది సందేహాలను వ్యక్తం చేశారు. అంతకముందు నాని నటించిన హిట్ 3లో గెస్ట్ అపీరియన్స్ ఇచ్చాడు. ఇద్నులో, బాగానే చేసినప్పటికీ సినిమానే యావరేజ్ టాక్‌తో సరిపెట్టుకుంది.

అడవి శేష్ సాలీడ్ హిట్ తో కంబ్యాక్ ఇవ్వాలంటే ఇప్పుడు చేస్తున్న గూఢాచారి 2తో గ్యారెంటీగా హిట్ కొట్టాలి. ఆ ప్రయత్నాలలోనే ఉన్నాడు శేష్. పాన్ ఇండియా వైడ్‌గా 2027 ఫిబ్రవరి 5న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. తాజాగా, ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ, వామికా గబ్బి, మధు శాలిని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ కలిసి నిర్మిస్తున్నారు.

#Adivi Sesh#G2#Tollywood#Gudhachari 2
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి