సినిమా

Rashmika Mandanna: పెళ్లి తర్వాత ఇలాంటి డెసిషన్ తీసుకుంటుందని ఎవరూ ఊహించలేదుగా!

రచన: Anshu4 నిమిషాల పఠనం

Rashmika Mandanna: నేషనల్ క్రష్..పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఇప్పుడు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి కారణం ఆమె పెళ్లే అని తెలుస్తోంది. సాధారణంగా హీరోయిన్స్ కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకుంటున్నారు. కొందరు పెళ్లి తర్వాత సినిమాలకి కొంతకాలం బ్రేక్ ఇస్తుంటే, కొందరు మాత్రం కంటిన్యూ అవుతున్నారు. ఇక్కడే, ఊహించని నిర్ణయం తీసుకుంది రష్మిక మందన్న. ఇకపై నో గ్లామర్ రోల్స్ అని తెలుస్తోంది.

విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకుంది రష్మిక మందన్న. అంతకముందే ఒప్పుకున్న సినిమాలు మైసా, రణబాలి. అయితే, వీటిలో రణబాలి సినిమాలో హీరో విజయ్ దేవరకొండ కావడం విశేషం. కాబట్టి, ఈ సినిమాలో పాత్ర ఎలా ఉన్నా పర్లేదు. కానీ, అలా కాకుండా ఓ యోధుడి భార్య జయమ్మ పాత్రలో నటిస్తోంది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా అక్టోబర్ 16న అని ప్రకటించారు.

ఇక, మరో పాన్ ఇండియా సినిమా మైసా కూడా రిలీజ్‌కి రెడీ చేయబోతున్నారు. అయితే, తాజాగా.. లెజండరీ గాయని ఎం.ఎస్.సుబ్బలక్ష్మి బయోపిక్‌లో రష్మిక మందన్న నటించబోతుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. రాక్‌లైన్ వెంకటేష్ మరో నిర్మాత. బన్నీ వాసు కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామిగా ఉన్నాడు. జెర్సీ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించబోతున్నాడు.

అయితే, ఇకపై రష్మిక అస్సలు గ్లామర్ రోల్స్ చేయదట. పెళ్లికి ముందు ఎలాంటి పాత్రలు చేసినా ఓకే గానీ, పెళ్లి తర్వాత మాత్రం హీరోలతో రొమాన్స్, లిప్ లాక్స్, స్కిన్ షో అంటే అత్తగారు ఇబ్బంది పడతారు. అందుకే, హుందాతనంతో కూడుకున్న బలమైన కథలో మాత్రమే ఇకపై రష్మిక నటించాలనుకుందట. ఒకరకంగా, సమంత మాదిరిగా రష్మిక కూడా పెళ్లి తర్వాత ఒప్పుకునే ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ క్లీన్‌గా ఉండేలా ప్లాన్ చేసుకుంటోంది.

#Rashmika Mandanna#Vijay Devarakonda#Ranabaali#Mysa#MS Subbalaxmi Biopic
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి