Kayadu Lohar: ప్యారడైజ్ సినిమా మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ అన్నీ అప్‌డేట్స్ వస్తున్నాయి గానీ హీరోయిన్ గురించి..ఆమె పాత్ర గురించి మాత్రం ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. దీంతో, అసలు ప్యారడైజ్ సినిమాలో హీరోయిన్ ఉందా..? అని కామెంట్స్ చేశారు. ఒకే ఒక్క పాటలో కనిపించిన కీర్తి సురేష్ మాత్రం బాగా హైలెట్ అయింది. కానీ, టీజర్‌లో ఎక్కడుందో అని వెతుక్కున్నారు హీరోయిన్‌ని.
అందుకే, తాజాగా మేకర్స్ ప్యారడైజ్ సినిమాలో హీరోయిన్‌గా నటించిన బ్యూటీ కయాదు లోహర్ పిక్ ని రిలీజ్ చేశారు. ఈ ఒక్క లుక్ చాలు..సినిమాలో ఆమె రోల్ ఎంత ఇంటెన్సివ్‌తో ఉండబోతుందో చెప్పడానికి. అంతేకాదు, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కావాలనే హీరోయిన్‌ని అంతగా రివీల్ చేయడం లేదని అర్థమైంది. ఖచ్చితంగా హీరోయిన్ రోల్ కి చాలా వెయిట్ ఉందని తెలుస్తోంది.
ఇటీవల కయాదు నటించిన సినిమాలు వచ్చాయి. వాటిలో ఒకటి ఇమ్మోర్టల్. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించాడు. అయితే, ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ సరసన ఐ యామ్ గేమ్ అనే సినిమా వచ్చింది. ఈ రెండు సినిమాలు పెద్ద గ్యాప్ లేకుండా వచ్చాయి. ఇలా, రెండు సినిమాలు ఫ్లాపైనా కూడా కొత్త ప్రాజెక్ట్స్ సైన్ చేస్తోంది.
ఇక, ఇప్పుడున్న పరిస్థితుల్లో కయాదుకి భారీ హిట్ అవసరం. నాని నటించిన పాన్ ఇండియన్ సినిమా ప్యారడైజ్ కయాదుకి చాలా కీలకం. ఈ సినిమా హిట్ అయితేనే టాలీవుడ్‌తో పాటు మిగతా భాషల్లోనూ అవకాశాలు దక్కుతాయి. లేదంటే శ్రీలీల..కృతి శెట్టి మాదిరిగా అవకాశాల కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. చూడాలి, మరి ప్యారడైజ్ సినిమా కయాదు లోహర్ కెరీర్‌కి ఏమేరకు ఉపయోగపడుతుందో.












