సినిమా

The Paradise: బిజినెస్ జరగకనే రిలీజ్ వాయిదా పడుతోందా?

రచన: Anshu4 నిమిషాల పఠనం

The Paradise: ఒక సినిమా లేదా ఒక కాంబినేషన్ సినిమా ముహూర్తం నుంచే అంచనాలు మొదలవుతాయి. అందుకు తగ్గట్టే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగిపోతుంది. ఇటీవల కాలంలో అనిల్ రావిపూడి సినిమా అంటే నాలుగైదు నెలల ముందు నుంచే బిజినెస్ క్లోజ్ అని వార్తలు వస్తుంటాయి. అలాగే, జన్యూన్‌గా కూడా బిజినెస్ పూర్తైపోతుంది. ఫస్ట్ వీక్ లోనే లాభాలలోకి సినిమా వచ్చేస్తుంది.

కొన్ని సినిమాలు మాత్రం ప్రమోషనల్ కంటెంట్ నచ్చకనో..అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ కాకనో..బిజినెస్ జరగక ఎదురుచూపులు తప్పవు. ఇప్పుడు, నాని సినిమా పరిస్థితి కూడా ఇలాగే ఉందని ఫిల్మ్ నగర్‌లో చెప్పుకుంటున్నారు. దసరా కాంబోలో తెరకెక్కుతోంది ది ప్యారడైజ్ సినిమా. నాని ఇందులో జడల్ అనే ఓ వెరైటీ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే, సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మీద అంత పాజిటివ్ టాక్ లేదు.

అలాగని, నెగిటివ్ టాక్ కూడా లేదు. అంచనాలు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి. అయితే, వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ, పలు కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. కాగా, ఇప్పుడు వినిపిస్తున్న మాట ప్రకారం ఇంకా 20 కోట్ల వరకూ లాస్ కనిపిస్తుందట. అనుకున్నట్టుగా బిజినెస్ జరగలేదని తెలుస్తోంది. దీనివల్లే సినిమా వాయిదా పడింది అంటున్నారు.

మరి, సెప్టెంబర్ 24న రిలీజ్ కాబోతున్న ది ప్యారడైజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలియడం లేదు. హిట్ 3 కూడా నానికి ఆశించిన విజయాన్ని ఇవ్వలేదు. అందుకే, ఈ సినిమాపై చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు. సీనియర్ నటుడు మోహన్ బాబు లాంటి వారున్నా, కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్ ఉన్నా, క్యూట్ హీరోయిన్ కయాదు లోహర్ అలరించబోతున్నా..సినిమాపై మాత్రం ఎందుకనో హైప్ రావడం లేదు.

#Nani#TheParadaise#KayaduLohar#SrikanthOdela#KeerthySureash
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి