పేరొందిన జర్నలిస్ట్ ముసుగంతా రాజకీయ మెప్పు కోసమే?
పచ్చ లైన్‌ను నమ్ముకున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి?
అతి భారీగా సంపాదించేసుకున్నారు?
పాత ఓ రోత అన్నట్లు ఇంకా రాధా గీసిన మత్తులో ఉంటే ఎలా?
వాళ్ల అడుగులకు మడుగులు ఒత్తే వాళ్ల కోసమే ఆ బతుకంతా?
అలానే రాస్తారు రాజగోపాల్..
ఆనాడు ఉద్యమాన్ని, ప్రభుత్వం వచ్చాక తెలంగాణను కించపరిచిన సంఘటనలు ఎన్నో?
ఈ రోజుల్లో వృద్ధ తరంపై మాట్లాడి ఎందుకు పెద్దోళ్లను చేస్తున్నారు?
కొత్త రక్తం మీడియా వచ్చేస్తోంది.. అది రాజకీయ రంగులా మారిన తీన్మార్ అయినా..
తొలిపలుకు కాదు వెలుగు అంటూ చెప్పే మన తొలివెలుగు అయినా..
ఏదైనా సరే ఆధారాలతో కడిగి పారేసే స్వేచ్ఛ న్యూస్ అయినా..
కొత్తగా వచ్చే సోషల్ మీడియానే కాదు.. న్యూస్‌ను కూడా చదవండి
అవినీతి, అక్రమాలపై ఫైటింగ్ చేసే న్యూస్ ఫైర్‌ను ప్రొత్సహించండి
ప్రాంతంతో పాటు పరిస్థితిని పాడు చేసే ఆ పాత కాలపు జర్నలిస్టులను మర్చిపోండి
రాబోయే తరం ఈ కుల, ప్రాంత, అభిమాన కుట్రలను తన్ని తరిమేలా ఉండాలి
కొత్త తరానికి, ధనిక, పేద ఆర్ధిక అసమానతలకు మీడియా రూపంలో కారణాలు చెప్పాలి
రాజకీయంగా ఎదిగే తత్వాన్ని నేర్పించాలి
అప్పుడే నిజమైన స్వేచ్ఛ
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల,
9848070809
వాళ్లను పట్టించుకుంటే ఈ స్థాయిలో ఉండేవాళ్లా?
ఆనాడు ఆంధ్రా పాలకుల మోచేతి నీళ్లు తాగి ఉద్యమాన్ని నీరుగార్చిన మేనేజ్‌మెంట్స్‌ను ఎప్పుడైనా పట్టించుకున్నారా? మీ ఉద్యమం ఆపారా? పదవులు కాదు, ఎంత పైసలు అయినా ఖర్చు చేస్తా అంటూ కారు డిక్కీలో పట్టే డబ్బులు ఆనాడు తీసుకొచ్చి కాంగ్రెస్ నేతలను తలొగ్గకుండా చేసింది మీరే కదా? ఆ ఉద్యమంలో మీ కాంగ్రెస్ ఎంపీల పాత్రను ఎవరూ కాదనలేరు. కానీ, ఇదే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు వ్యతిరేకంగా ఈనాడు రాశాడంటే ఎందుకు అంతగా రియాక్ట్ ఆయ్యారు. మీరు తలుచుకుంటే జర్నలిజం ముసుగులో వాళ్లు సంపాదించింది ఎంత? వాళ్ల భవిష్యత్ ఏంటో మీరు కళ్ల ముందు చూపించగలరు. తెల్లారి వచ్చే వార్తల నుంచి ఈ రోజు త్రీడీ మిక్సింగ్‌తో ప్రతిదీ ఇన్‌స్టా అయిపోయింది. ఈ రోజుల్లో ఎందుకు పాత తరం వార్తల కోసం ఆలోచిస్తున్నారు. ఛానల్ అంటే ఎన్నో రకాల అనుమతుల నుంచి ఈనాడు ఒక్క మెయిల్ ఐడీ ఉంటే చాలు అనుకునే పరిస్థితికి వచ్చాం. పేపర్ అంటే ఆర్ఎన్ఐ అనుమతులు అనుకునే రోజుల నుంచి ఫేస్ బుక్, సోషల్ మీడియా, ఈ పేపర్స్ దగ్గరకు వచ్చాం. ఇన్‌స్టా లాంటి షార్ట్ న్యూస్ ఫేమస్ అవుతున్నాయి. వే టూ న్యూస్‌కు ఏముందని ఫేమ్ అయింది. ఇంకా ఆ ఈనాడు, ఈ తెలంగాణలో ఆంధ్రజ్యోతి గురించి ఆలోచిస్తారా? వార్త క్షణాల్లో వస్తుంది. నిర్ణయం ప్రజలది. అందుకే ఈ స్వేచ్ఛాయుత సందేశం. మంచికోరే రాజకీయ నాయకుల కోసం స్వేచ్ఛ జ్యోతిలా పని చేస్తాం.












