సినిమా

టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

తెలుగు చిత్రసీమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు (73) తీవ్ర అనారోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు. ఆయన మరణవార్తను ప్రముఖ నటి కరాటే కల్యాణి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ వార్తతో టాలీవుడ్ వర్గాల్లో శోకఛాయలు అలముకున్నాయి. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) తో పాటు పలువురు సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఆయన మృతికి తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు.

మద్రాస్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో నటనా శిక్షణ పొందిన జీవీ నారాయణరావుకు తోటి నటులు, సూపర్ స్టార్స్ రజనీకాంత్, చిరంజీవిలతో ఎంతో కాలంగా మంచి సాన్నిహిత్యం ఉంది. 1976లో దిగ్గజ దర్శకుడు కె.బాలచందర్ తెరకెక్కించిన ‘అంతులేని కథ’ చిత్రంతో ఆయన వెండితెరకు పరిచయమయ్యారు. తన విలక్షణమైన నటనతో తొలి సినిమాకే ‘ఉత్తమ సహాయ నటుడి’గా ప్రతిష్టాత్మక నంది అవార్డును అందుకోవడం విశేషం. ఆ తర్వాత వచ్చిన ‘ఒక ఊరి కథ’ సినిమాకు గాను ఆయన ప్రత్యేక జ్యూరీ అవార్డును కూడా గెలుచుకున్నారు.

తెలుగు తెరపై 100కు పైగా చిత్రాల్లో నటించిన జీవీ నారాయణరావు, కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించారు. ‘ముత్యాల పల్లకి’, ‘అంగడి బొమ్మ’, ‘చిలకమ్మ చెప్పింది’, ‘గ్యాంగ్ లీడర్’, ‘హిట్లర్’ వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో కీలక పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. మెగాస్టార్ చిరంజీవితో ‘దేవాంతకుడు’, ‘యముడికి మొగుడు’ వంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాలను ఆయన నిర్మించి విజయం సాధించారు.

ఒక నటుడిగా, నిర్మాతగా తెలుగు రంగానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవి. జీవీ నారాయణరావు మరణం టాలీవుడ్‌కు తీరని లోటని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, వారి కుటుంబ సభ్యులకు అభిమానులు, సినీ ప్రతినిధులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.

#GVNarayanaRao#TollywoodNews#SeniorActorGV#TeluguCinema#MAA#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి