మంచి కోసం పని చేయాలి.. పార్ట్-5
ఎలక్షన్ కోసమో, దేశ భవిష్యత్ అంటే భరిస్తారు
కమీషన్స్ అంటూ ప్రతిదీ అలవాటుగా మార్చుకుంటే ఉతికారేస్తారు
రైజింగ్ స్టేట్‌లో డ్రైనేజ్ వ్యవస్థను పారదోలాలి
పాలకు పాలు, నీళ్లకు నీళ్లులా గతంలానే ప్రవర్తించండి సీఎం గారు
గత పాలకుల పేర్లతో కేసులంటూ ఎంతో చేసుకున్నారు.. ఇక చాలు
ప్రజలపై అదే తీరుగా రెవెన్యూ దోపిడీ చేస్తే తిరగబడుతారు
ఎన్నో రకాలుగా తప్పులు జరిగాయి.. ఇప్పుడు సామాన్యులు బలి కావాలా?
రిజిస్ట్రేషన్ చేసిన ప్రతి ఇంటికి మళ్లీ రిజిస్ట్రేషన్ చేసేలా నిర్ణయం తీసుకోండి
లేదంటే స్వేచ్ఛ న్యూస్ మీరు అనుకునే చట్టాలపై కూడా ఫైట్‌కు సిద్ధం
గతంలో అంతా మీకు మనీయే.. ఇప్పుడు అన్నింటికీ మనీ కాదు సీఎం సాబ్?
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల,
9848070809.
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఎన్ని పాపాలు చేసినా 5 ఏండ్ల తర్వాతనే సమాజానికి అర్ధం అయింది. కానీ, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై రెండేండ్లు కాకుండానే తీవ్ర వ్యతిరేకత వచ్చింది. 10 ఏండ్లు నేనే సీఎం అనే రేవంత్‌కు కూడా పార్టీలు మార్చినట్లు ప్రత్యేకంగా సీఎం ఉండాలనే పొలిటికల్ రోల్ పెంచుకున్నారు. ఇదంతా 3 నెలల ముందు కూడా అందరూ ఆయన చేసిన పనులకు పకృతి కలిసి పని చేసింది. కానీ, ఇప్పుడు రెవెన్యూపై పుట్టిన దురుద్దేశం మొత్తం పార్టీకే కాదు అన్నింటి నాశనాన్ని కొరుకుంటోంది. రెవెన్యూ మినిస్టర్ అయిన శ్రీనివాసరెడ్డి ఎన్ని దందాలు చేశారో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వాళ్లకు తెలుసు. లిటిగేషన్ ఉంటే ప్రైవేట్ సైన్యాన్ని నడిపించిన ఆ మంత్రి నేనే ప్రభుత్వం అన్నట్లుగా ఉన్నారు. వ్యక్తి ఎప్పుడూ ప్రభుత్వం కాలేడు. అదే దందాతో రెవెన్యూను మొత్తంగా గుప్పిట్లో పెట్టుకునేందుకు ఆశగా 22ఏ పేరుతో చేసిన దందా తెలంగాణ సమాజం మర్చిపోదు. ఓ నవీన్ మిట్టల్, ఓ హరీష్ రెడ్డి, మరో శేషగిరిరావు, ఇంకో రిజిస్ట్రార్ ఇలా అందరూ ప్రభుత్వం కోసం పని చేయాలి కానీ, ప్రైవేట్ ఆస్తుల కోసం పని చేస్తామంటే ఎలా ఉంటుంది సీఎం గారు. 22ఏ లో రిజిస్ట్రేషన్, పట్టా అయిన భూములను పెట్టారు అంటే గతంలో మీరు అనుకున్న జీవోలతో పాటు మరెన్నో జీవోలు, సర్క్యూలర్స్ వచ్చి ఉంటాయి. వాటన్నింటిని మీరు పరగణనలోకి తీసుకోకుండా మీరు అనుకున్నవే నిజం అనుకున్నట్లు ప్రోహిబిటెడ్‌లో పెట్టి, పైసల కోసం ప్రైవేట్ బ్రోకర్స్‌ను మార్కెట్‌లో దింపితే ఎలా అనుకోవాలి? ఒక్కొక్క కాలనీకి కోటి నుంచి 5 కోట్లు ఇవ్వాలంటే, తప్పు ఎవరు చేసినట్లు? ఎవరు డబ్బులివ్వాలి? రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖపై ఏం నమ్మకం ఉంది? ఈ రోజుల్లో డబ్బులు కట్టించుకుని చేస్తున్న ప్రభుత్వ డాక్యుమెంట్‌కు ఎలా గ్యారెంటీ ఇస్తున్నారు? అందుకే రెవెన్యూకి సిగ్గుందా? మంత్రులకు మానం ఉందా అని రాయాల్సిన పరిస్థితి జర్నలిస్టుకు ఎందుకు వచ్చిందో అర్ధం చేసుకోండి. ఈరోజు డిఫెన్స్ కాలనీ కావొచ్చు. మరోరోజు మరో కాలనీ క్లియర్ చేయొచ్చు. కానీ, ఒక సొంతింటి ఓనర్‌కు రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్‌పై ఎలాంటి అనుమానం లేకుండా మళ్లీ రిజిస్ట్రేషన్ చేస్తేనే మీ మంత్రుల మనీ మత్తు కాదు.
ఎన్నో దందాలు చేశారు
రెవెన్యూ మంత్రి అతిక్రమించిన అక్రమాలు ఎన్నో ఆధారాలతో సహా స్వేచ్ఛ న్యూస్ ఛైర్మన్ దేవేందర్ రెడ్డి వద్ద ఉన్నాయి. ఇకనైనా రెవెన్యూలో పెద్ద వాళ్లు అని దోచుకుంది చాలు, చిన్న ఫ్యామిలీలను వదిలేయండి. లేదంటే 6 నెలల్లో అన్ని ఆధారాలతో సహా మీ దందాలను స్వేచ్ఛాయుతంగా ఆధారాలతో జెన్ జీ రూపంలో బయట పెట్టేందుకు స్వేచ్ఛ న్యూస్ దేవేందర్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు.












