ఏపీ

TTD : తిరుమల శ్రీవారికి భక్తులకు బిగ్ ‌అప్డేట్.. ఇలా అస్సలే చేయొద్దు

రచన: Kumar4 నిమిషాల పఠనం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. తిరుమలకు వచ్చే భక్తులు స్వామి వారి దర్శనం మరికొన్ని గంటలు వెయిట్ చేయక తప్పదని పేర్కొన్నట్టు సమాచారం. ప్రస్తుతం శ్రావణమాసం చివరి వారం కావడం, శుభముహూర్తాలు ప్రారంభం కావడంతో భక్తులు పెద్దఎత్తున తిరుమలకు వెళ్తున్నట్టు తెలిసింది.

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. తిరుమలకు వచ్చే భక్తులు స్వామి వారి దర్శనం మరికొన్ని గంటలు వెయిట్ చేయక తప్పదని పేర్కొన్నట్టు సమాచారం. ప్రస్తుతం శ్రావణమాసం చివరి వారం కావడం, శుభముహూర్తాలు ప్రారంభం కావడంతో భక్తులు పెద్దఎత్తున తిరుమలకు వెళ్తున్నట్టు తెలిసింది.అయితే, స్వామి వారి దర్శనానికి చాలా సమయం పడుతోందని, భక్తులు అందుకు సహకరించాలని టీటీడీ కోరింది.

గురువారం తెల్లవారుజామున శ్రీవారి దర్శనార్థం భక్తులు భారీగా పోటెత్తారు. దీంతో తిరుమల గిరులు భక్త జనసంద్రంగా మారాయి. గోవింద నామస్మరణలతో తిరుమల గిరులు మార్మోగుతున్నాయి. భక్తులు భారీగా రావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు అన్ని పూర్తిగా నిండిపోయాయి. క్యూ లైన్లు వెలుపల శిలాతోరణం వరకు బారులు తీరినట్టు సమాచారం. దీంతో టైమ్ స్లాట్ టోకెన్లు లేని సాధారణ భక్తులకు స్వామివారి సర్వ దర్శనం కోసం దాదాపు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ వెల్లడించింది.

క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వారికి నిరంతరాయంగా తాగునీరు, పాలు, అన్నప్రసాదాలను సిబ్బంది అందజేస్తున్నట్టు తెలిసింది. చిన్న పిల్లలు, వృద్ధుల కోసం మెడికల్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఎవరైనా క్యూ లైన్లో ఇబ్బంది పడితే వారిని బయటకు ప్రత్యేకంగా సిబ్బందిని సైతం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.

ఇదిలాఉంటే నిన్న ఒక్కరోజే 77,568 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నట్టు తెలిసింది. 35,033 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించగా.. కానుకల ద్వారా నిన్న శ్రీవారి హుండీకి రూ.4.19 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. ఇక ప్రసాద విక్రయాల విషయానికొస్తే నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 4.15 లక్షల లడ్డూలను భక్తులకు విక్రయించినట్టు టీటీడీ తెలిపింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ వెల్లడించింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని స్వామి దర్శనం కోసం స్లాట్ బుకింగ్స్ చేసుకోవాలని సైతం టీటీడీ కోరినట్టు సమాచారం.

#Tirumala#TTD#token darshan#Full Rush#24 hours waiting#Andrapradesh
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి