తెలంగాణ

ACB : భూపాలపల్లి జిల్లా మైన్స్ ఏడీ జయరాజు నివాసంలో ఏసీబీ సోదాలు!

రచన: Kumar••4 నిమిషాల పఠనం

రాష్ట్రంలో ఏసీబీ దూకుడు పెంచింది. ఇప్పటికే ప్రభుత్వ శాఖల్లోని పలు విభాగాల్లో పనిచేస్తూ ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించుకున్నట్టు ఆరోపణలు వచ్చిన వారి మీద, వారి బంధువులు, బినామీల ఇళ్లల్లోనూ వరుస దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మైన్స్ ఏడీ జయరాజుపై ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాయని ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించినట్టు సమాచారం.

రాష్ట్రంలో ఏసీబీ దూకుడు పెంచింది. ఇప్పటికే ప్రభుత్వ శాఖల్లోని పలు విభాగాల్లో పనిచేస్తూ ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించుకున్నట్టు ఆరోపణలు వచ్చిన వారి మీద, వారి బంధువులు, బినామీల ఇళ్లల్లోనూ వరుస దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా మరో ప్రభుత్వ అధికారిపై ఏసీబీ కొరడా ఝలిపించినట్టు సమాచారం.

ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాయని ఆరోపణలు రావడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూగర్భగనుల ఏడీ జయరాజుపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించినట్టు సమాచారం. గురువారం తెల్లవారు జామున ఆయన ఇళ్లు,బంధువులు, బినామీల ఇండ్లపై దాడులు జరిపినట్టు తెలుస్తోంది.ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.

వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో నగరంలోని బోడుప్పల్‌లో గల ఆయన నివాసం, భూపాలపల్లి, సూర్యాపేట, వికారాబాద్ జిల్లా తాండూరుతో పాటు ఆయన బంధువులు, సన్నిహితులకు చెందిన మొత్తం 12 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు జరిపినట్టు సమాచారం. భూపాలపల్లి ఏడీఈగా పనిచేస్తూనే ములుగు జిల్లా ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్న జయరాజ్‌పై గత కొన్నేళ్లుగా తీవ్రమైన అవినీతి ఆరోపణలు వచ్చాయి.

ముఖ్యంగా భూపాలపల్లి పరిధిలో ఇసుక అక్రమ రవాణా, గనుల దోపిడీదారులతో చేతులు కలిపి ఆయన భారీగా అక్రమార్జనకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. తనిఖీల్లో పెద్దమొత్తంలో అక్రమాస్తులను గుర్తించినట్టు తెలుస్తోంది. వీటి విలువ బహిరంగ మార్కెట్లో రూ.వందల కోట్లు ఉంటుందని టాక్. ఆయన ఇంట్లో పెద్దఎత్తున నగదు, బంగారం, కీలక భూముల రిజిస్ట్రేషన్ పత్రాలు, బినామీ ఆస్తుల వివరాలను అధికారులు స్వాధీనం చేసుకుని లెక్కిస్తున్నట్టు సమాచారం.

అలాగే భూపాలపల్లి మైన్స్ ఏడీఈ కార్యాలయంలోని ఓ ఉద్యోగిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని ముమ్మరంగా విచారిస్తున్నట్టు తెలిసింది. గత కొంతకాలంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మైన్స్ ఏడీ జయరాజ్ కదలికలపై నిఘా ఉంచిన ఏసీబీ.. విశ్వసనీయ సమాచారం మేరకు ఇవాళ తెల్లవారుజామున దాడులు నిర్వహించినట్టు తెలిసింది.కాగా, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఉన్నతాధికారుల చేతుల మీదుగా జయరాజు 'ఉత్తమ అధికారి' అవార్డు అందుకోగా.. కొద్ది రోజుల వ్యవధిలోనే ఆయన ఇళ్లపై ఏసీబీ దాడులు చేయడం అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.

#Acb raids#bhupalapally mines Ad jayaraju#telangana#Illegal Assets
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి