సినిమా

Ram Pothineni: సీనియర్స్‌తో పోటీ రిస్కేమో రామ్?

రచన: Anshu4 నిమిషాల పఠనం

Ram Pothineni: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గత కొంతకాలంగా హిట్స్ లేక రేసులో బాగా వెనకబడ్డాడు. నాని లాంటి మిడ్ రేంజ్ హీరోలందరు పాన్ ఇండియా సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటున్నారు. కానీ, రామ్ పోతినేని మాత్రం సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. గత చిత్రం ఆంధ్రాకింగ్ తాలూకా కూడా భారీ విజయం దక్కుతుందని ఆశిస్తే, అందుకు భిన్నంగా ఫలితం వచ్చింది.

ఇప్పుడు, ఈ ఎనర్జిటిక్ స్టార్ స్వీయ రచన-దర్శకత్వంలో సినిమాను చేస్తున్నాడు. నిర్మాణ సంస్థ కూడా స్వయానా అన్నది కావడం విశేషం. ప్రస్తుతం, రామ్ పోతినేని చేస్తున్న సినిమా ఇదొక్కటే. దీనిమీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఒకవైపు హీరోగా నటిస్తూ మరోవైపు దర్శకుడిగా మెగా ఫోన్ పట్టుకోవడం అంటే రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నట్టే.

రామ్ పోతినేని లాంటి హీరో కమ్ డెబ్యూ డైరెక్టర్‌కి ఇది చాలా కష్టమైన ప్రయాణం. కానీ, ఎంతో నమ్మకంగా సినిమాను రెడీ చేస్తున్నాడు. ఇప్పటికే, పెద్ద రిస్క్ చేస్తున్నాడు అనుకుంటే అంతకంటే పెద్ద రిస్క్ డిసెంబర్ నెలలో చేయబోతున్నాడు. అంటే, భారీ అంచనాలతో వస్తోన్న బిగ్ స్టార్స్‌తో మన రామ్ పోటీకి దిగబోతున్నాడు. అది, కూడా పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, కింగ్ నాగార్జునలతో.

రామ్ పోతినేని సినిమా ప్రకటించినప్పుడే డిసెంబర్ టార్గెట్‌గా వస్తున్నామని వెల్లడించాడు. కానీ, అప్పటికీ ప్రభాస్ ఫౌజీ, కింగ్ 100, బాలయ్య-గోపీచంద్ మలినేని సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించలేదు. ఆ తర్వాత ఈ ముగ్గురు స్టార్స్ తమ సినిమాలను డిసెంబర్ నెలలో రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. ఇది, ఇప్పుడు రామ్ పోతినేని సినిమాకి గట్టి పోటీగా మారింది. వెనక్కి తగ్గుతాడని అందరూ భావిస్తుంటే, రామ్ మాత్రం అస్సలు తగ్గేదేలే అంటున్నాడు. చూడాలి, మరి మన రామ్ పోటీలో ఎంతవరకూ నెగ్గుకొస్తాడో.

#rampothineni#rapo23#prabhas fauzi#balayya#nbk111
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి