ఏపీ

AP : పల్నాడులో ఘోర ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం

రచన: Kumar4 నిమిషాల పఠనం

ఏపీలో మరో తీవ్ర విషాదం నెలకొంది. ప్రయివేటు ట్రావెల్స్ మితిమీరిన వేగానికి అమాయకులు బలవుతున్నారు. నిన్న ఉదయం హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఆరుగురు ఏపీ వాసులు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే.

ఏపీలో మరో తీవ్ర విషాదం నెలకొంది. ప్రయివేటు ట్రావెల్స్ మితిమీరిన వేగానికి అమాయకులు బలవుతున్నారు. నిన్న ఉదయం హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఆరుగురు ఏపీ వాసులు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఇనుప స్తంభాల లోడ్‌తో వెళ్తున్న కంటైనర్ లారీని ట్రావెల్ బస్సు వేగంగా వచ్చి ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందగా, 14 మందికి తీవ్రగాయాలయ్యాయి.ఆ ఘటన జరిగి 24 గంటలు కూడా పూర్తవకముందే నిన్న రాత్రి పల్నాడుతో మరో ఘోరం చోటుచేసుకుంది.

చిలకలూరిపేట వద్ద ఆటోను ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందగా మరో 10 మందికి గాయాలయ్యాయి.మృతులను బొంత బాబు, మణెమ్మ, సంపూర్ణమ్మ, లక్ష్మీ, గంగమ్మగా గుర్తించారు.మృతులంతా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. మరణించిన వారి మృతదేహాలను పోస్టు మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

క్షతగాత్రులను చిలకలూరిపేట, గుంటూరు ఆసుపత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ప్రకాశం జిల్లా కొండమంజులూరులో పుట్టినరోజు వేడుకల కోసం బాధితులు ఆటోలో వెళ్లినట్టు సమాచారం. వేడుకలు ముగించుకుని వేలూరు గ్రామానికి తిరిగి వస్తుండగా విజయవాడ నుంచి చెన్నై వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంతో వేలూరు గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

https://x.com/pulsenewsbreak/status/2092811191924244832?s=20

అయితే, కోదాడ సమీపంలో జరిగిన ప్రమాదానికి, నిన్న రాత్రి పల్నాడు జరిగిలో ప్రమాదానికి ప్రయివేటు ట్రావెల్స్ బస్సులే కారణమని తెలుస్తోంది.రాత్రి పూట ప్రయివేటు ట్రావెల్స్ బస్సులు మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్నాయని, ఆర్టీసీ బస్సుల వలే వాటికి కూడా స్పీడ్ లాక్ అమర్చాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఇకపోతే రెండు ప్రమాదంలో ఏపీ వాసులు మృతి చెందడంతో ఏపీ ప్రభుత్వం తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది.

#auto bus hit#Accident#five passengers#death#andrapradesh
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి