National

SIR : ఈసీ అబద్ధాలు ఆడుతోంది.. నా దగ్గర అన్ని ఆధారాలున్నాయి : ప్రకాశ్ రాజ్

రచన: Kumar••4 నిమిషాల పఠనం

సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం మీద తీవ్ర విమర్శలు చేశారు. తన ఓటు హక్కు తొలగించినందుకు ఆయన ఈసీ, కేంద్రంలోని మోడీ సర్కారును తప్పుబట్టిన విషయం తెలిసిందే. తన ఓటును తొలగించినంత మాత్రాన ఏమీ కాదని, త్వరలోనే మిమ్మల్ని గద్దెదింపుతామని ప్రధాని మోడీని ఉద్దేశించి కామెంట్స్ చేశారు.

సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం మీద తీవ్ర విమర్శలు చేశారు. తన ఓటు హక్కు తొలగించినందుకు ఆయన ఈసీ, కేంద్రంలోని మోడీ సర్కారును తప్పుబట్టిన విషయం తెలిసిందే. తన ఓటును తొలగించినంత మాత్రాన ఏమీ కాదని, త్వరలోనే మిమ్మల్ని గద్దెదింపుతామని ప్రధాని మోడీని ఉద్దేశించి కామెంట్స్ చేశారు. తాజాగా మరోసారి సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను పోస్టు చేశారు.

అయితే, ప్రకాశ్ రాజ్ ఓటు తొలగించలేదని మరల ఈసీ క్లారిటీ ఇచ్చింది. దీనిపై మండిపడిన ఆయన తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.‘ఈసీ అధికారులు పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. తన ఓటు తొలగించలేదని ఈసీ అధికారులు చేసిన ప్రకటనపై అబద్ధం. నా ఓటు తొలగించారని వీడియో చేశాక.. నాకు ఫోన్ చేసి పొరపాటు జరిగిందని అధికారులు చెప్పారు. ఆ కాల్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి.దయచేసి సోషల్ మీడియాలో వీడియో తీసేయండి. పొరపాటు జరిగిందని మళ్లీ వీడియో పోస్ట్ చేయండని అధికారులు నన్ను అడిగారు.

హడావిడిగా వెబ్‌సైట్‌లో షిఫ్టెడ్ అని మార్చి, గోది మీడియాకు పంపి నేను అబద్ధం చెప్పానని చిత్రీకరించారు.దేశ పౌరులు లైన్లో నిలబడి మా ఓటు మాకు కావాలి అని అడుక్కోవాలా? త్వరలో అన్ని ఆధారాలతో ప్రెస్‌మీట్ పెడతాను’ అని పేర్కొన్నారు.

ఇదిలాఉండగా, దేశవ్యాప్తంగా ఓటరు జాబితా సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియ ముగిసింది. 2002 ఓటరు జాబితా మ్యాపింగ్ ప్రకారం ఎవరైతే లిస్టులో పేరు లేనివారు, ఎన్యూమరేషన్ ఫారమ్స్ అందుకోలేని వారు తమ ఓటు హక్కును కోల్పోయారు. మరికొందరు ఫారమ్స్ అందుకున్నా వాటిని ఎలా నింపి ఇవ్వాలో తెలియక ఖాళీ పేపర్స్ ఇచ్చారని తెలిసింది. ఇక ఫారమ్స్ తిరిగి ఇవ్వని వారు కూడా చాలా మందే ఉన్నట్టు ఈసీ వెల్లడించింది. అయితే, వీరంతా ఓటు హక్కును కోల్పోవాల్సి వచ్చింది.

https://x.com/TeluguScribe/status/2087797886553854005?s=20

వీరికి ఓటు హక్కు కావాలంటే ఈసీ అడిగిన డాక్యుమెంట్స్ సమర్పించి మరల ఓటును పొందాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఎస్ఐఆర్ చేపట్టడానికి గల ప్రధాన ఉద్దేశం..అక్రమ వలసదారులు, డూప్లికేట్ ఓట్లు, చనిపోయినవారి ఓట్లు, డబుల్ ఓట్లను తొలగించడమే.. ఈ క్రమంలోనే దేశంలోని ఒక్కో రాష్ట్రంలో లక్షలకు పైగా ఓట్లు డిలీట్ అయ్యాయి.

#Actor prakashraj#vote delete#CEC#lying#video statement
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి