- అన్నలు ముఖేషులు.. భర్తలు అనిల్స్ తీరుతో ఇబ్బందులు?
- అంబానీ కుటుంబాలే కాదు.. తెలుగు రాజకీయాలను ఆడాఈడా మార్చేసే కుట్ర?
- సంపాదనే ముఖ్యం అంటూ శత్రువులతో ములాఖత్?
- ఏపీలో నిజమైంది.. ఇక తెలంగాణలోనే మిగిలింది?
- భర్తల ఆశల పల్లకీలో బిజీగా ఉన్న ఆడబిడ్డల పరిస్థితి ఇదే?
- వాళ్లకో లెక్క ఉంది.. ఆ లెక్కల కోసమే ఈ శూన్య రాజకీయం?
- గారాల పట్టీలు డబ్బుల కోసం గబ్బు పట్టిస్తున్న తీరు ఏంటి?
- ఆస్తుల్లో భాగమైతే ఇస్తాం.. శత్రువుల కుట్రలకు లొంగిపోతే ఏం చేయాలంటున్న పేదల పెన్నది తనయుడు? ఉద్యమాల తండ్రి?
- ఆ ఇద్దరి తీరు మారేలా లేని పరిస్థితిపై స్వేచ్ఛ ఛైర్మన్ దేవేందర్ రెడ్డి స్పెషల్ స్టోరీ
ఇద్దరూ ఇద్దరే
ఇంటి ఆడబిడ్డలను తెలుగు గడ్డ ఎలాంటి కష్టం వచ్చినా కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది. భర్తే సర్వస్వం అనుకుని బతికే సంస్కృతి ఉన్నా.. కూతురు సుఖంగా ఉందా? అని తాపత్రయపడటం మాత్రం ప్రతి తండ్రికీ సహజమే. అలాంటి తెలుగు రాష్ట్రాలను ఏలిన ఓ నేత మరణించిన తర్వాత ఆయన కుటుంబంలో వాటాల పంపకం జరిగిందనే విమర్శలు వినిపించాయి.
అయితే, ఆ తర్వాత ఆ బిడ్డ తన రాజకీయ ప్రయాణంలో మొదట తెలంగాణలో, ఆపై ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పేరుతో డబ్బులు దండుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారనే ఆరోపణలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇక తెలంగాణ సాధించి, ఉద్యమ నేతగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడి బిడ్డ బతికుండగానే.. డబ్బు కోసం ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధపడుతున్నారంటూ వస్తున్న ఆరోపణలు, విమర్శలు మరింత చర్చకు దారితీస్తున్నాయి. కుటుంబం, రాజకీయ వారసత్వం, ప్రజా ప్రయోజనాల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయా? అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.
తండ్రి ప్రేమ పంచుతాడు.. ఆస్తులు కాదు!
ధీరూభాయ్ అంబానీ తన చిన్న కుమారుడు అనిల్ అంబానీకి కూడా భారీగా ఆస్తులు, వ్యాపార సామ్రాజ్యాన్ని అప్పగించారు. కానీ ఆ తర్వాత అనిల్ అంబానీ చేపట్టిన అనేక వ్యాపారాలు తీవ్ర నష్టాలను చవిచూశాయి. ఆస్తులు ఉన్నంత మాత్రాన వాటిని నిలబెట్టుకోవడం సాధ్యం కాదనే విషయానికి ఇది ఒక ఉదాహరణగా నిలిచింది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరున్న నేతలు, వాళ్ల కోసం తమ ప్రాణాలు కూడా లెక్కచేయని అభిమానులు, కార్యకర్తలు ఉన్నారని తెలిసినా.. ఆ ఆడబిడ్డలు తమ భర్తల కోసం శత్రువులతో చేతులు కలిపి చెడ్డ పేరు తెచ్చుకున్నారు. వాళ్లు ఎన్ని ఉద్యమాలు చేసినా డబ్బుల కోసమే తప్ప ప్రజల కోసం కాదని అర్ధమైంది. అందుకే ఏపీలో నమ్ముకున్న పార్టీ కనీసం ఎంపీ సీట్ ఇవ్వలేదు. దీంతో గప్‌చుప్‌గా ఉన్నారు.
బిడ్డలే సర్వస్వం అనుకుంటే బద్నాం చేస్తున్న వైనం?
బిడ్డ జైల్లో ఉంటే ఉద్యమ నేత భరించలేకపోయారు. చేసేది ఏమీ లేక చూస్తూ ఉండిపోయారు. అయినా కూడా పార్టీని మరో పార్టీలో కలిపేస్తా అన్నారని ఆ ఉద్యమ నేత బిడ్డ బాంబు పేల్చింది. అదే పేరుతో పార్టీ పెట్టి శత్రువులతో చేతులు కలిపినట్టు ఆరోపణలున్నాయి.. డబ్బుల కోసం అడ్డగోలుగా ధర్నాలు చేయడం అలవాటు చేసుకుంది. ఇక గతంలో ఏపీ మహిళా నేత కూడా చేసింది ఇదే.
ఆ విధానాన్నే ఇప్పుడు ఓ తెలంగాణ మహిళా నేత అనుసరిస్తున్నారంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. డబ్బు కోసం ఎంతగా పరుగెత్తినా చివరికి మిగిలేది ఏమిటో అంబానీ కుటుంబ పరిణామాలు చూపించాయని కొందరు ఉదాహరణగా చెబుతున్నారు. అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో పలువురు మహిళా నేతల కుటుంబ వ్యవహారాలు, ముఖ్యంగా వారి భర్తల రాజకీయ వైఖరి, ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
సమాజం కోసం పోరాడుతున్నామని చెప్పుకుంటూ, చివరికి కుటుంబ ప్రయోజనాల కోసమే ఇంతటి రాజకీయ డ్రామా ఎందుకు అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. శత్రువులతో చేతులు కలపాల్సిన అవసరం లేకపోయినా, కలిసి ముందుకు సాగేందుకు ఇప్పటికీ అవకాశం ఉందని కొందరు అంటున్నారు. అయినప్పటికీ తమ వైఖరి మార్చుకోకుండా ఆ ఆడబిడ్డలు రాజకీయంగా కొత్త కొత్త వేషాలు వేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.


