తెలంగాణ

HYD : సౌకర్యాలు నిల్.. 17న సనత్ నగర్ టిమ్స్ ప్రారంభించనున్న సీఎం

రచన: Kumar••3 నిమిషాల పఠనం

రాష్ట్ర ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యసేవలు అందించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రారంభించబడిన సనత్ టిమ్స్ హాస్పిటల్.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చొరవతో ఎట్టకేలకు పూర్తయ్యింది.మేజర్ వర్క్స్ పూర్తవ్వగా.. ఇంటర్నల్ పనులు కొన్ని పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం.

రాష్ట్ర ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యసేవలు అందించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రారంభమైన సనత్ టిమ్స్ హాస్పిటల్ నిర్మాణం.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చొరవతో ఎట్టకేలకు పూర్తయ్యింది.మేజర్ వర్క్స్ పూర్తవ్వగా.. ఇంటర్నల్ పనులు కొన్ని పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం.అయితే, ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన హాస్పిటల్ ప్రారంభం.. ఈ నెల 17వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభం కానుందని తెలిసింది.

ప్రస్తుతం సనత్ నగర్ టిమ్స్ ఆస్పత్రిలో ఓపీ సేవలు కొనసాగుతున్నాయి.అయితే, పూర్తి స్థాయి సౌకర్యాలు అందుబాటులోకి రాకుండానే ఆస్పత్రిని ఎందుకు ప్రారంభిస్తున్నారని వైద్యు నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి హాస్పిటల్ ప్రారంభించిన తర్వాత కూడా కేవలం ఓపీ సేవలు మాత్రమే కొనసాగుతాయని తెలుస్తోంది.

ఎందుకంటే కార్డియాక్ లాంటి అత్యవసర విభాగాల్లో కనీసం పరికరాలు కూడా ఇంకా ఆసుపత్రికి చేరుకోలేదని సమాచారం. ప్రారంభోత్సవానికి మరో నాలుగు రోజులు మాత్రమే గడువు ఉందని, కనీసం ఈ లోపైనా పూర్తి స్థాయి సౌకర్యాలు అందుబాటులోకి తేవాలని వైద్య నిపుణులు కోరుతున్నారు. ఒక్కసారి ఆస్పత్రి ప్రారంభం అయ్యాక రోగులు వస్తూనే ఉంటారు.

అటువంటి సమయంలో పరికరాల షిఫ్టింగ్ ఇబ్బంది అవుతుందని,అధునాతన పరికరాలు లేకుండా రోగులకు మెరుగైన వైద్యం ఎలా అందుతుందని వైద్య నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా టిమ్స్‌లో మేజర్ చికిత్సలకు సంబంధించిన పరికరాలు సమకూర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

https://x.com/TeluguScribe/status/2087758559601938561?s=20

#sanath nagar#TIMS#opening#cm revanth reddy#hyderabad
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి