తెలంగాణ

Telangana: సారూ.. ఒక్క యూరియా బస్తా ఇవ్వండి.. మీ కాళ్లు మొక్కుతా!?.. ప్రజా పాలనలో రైతు ఆవేదన..

రచన: Venu••5 నిమిషాల పఠనం

పదవుల కోసం రైతులను పావులుగా వాడుకుంటున్న పార్టీల వల్ల రైతులకు ఒరిగింది ఏం లేదనే విమర్శలున్నాయి. రైతుకు ఇచ్చిన హామీలు నీటి మీది రాతల్లా మారిపోతున్నాయే కానీ వారి తలరాతను మార్చడం లేదని వాపోతున్న వారు ఎందరో ఉన్నారు. ఈ క్రమంలో యూరియా కోసం రైతు పడుతున్న కష్టం చూస్తే.. అన్నదాత పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్థమవుతోంది.

ప్రభుత్వాలు మారిన, నాయకులు మారిన.. ఇప్పటికీ మారని బ్రతుకులు రైతులవి.. అమలుకు వీలుకాని హామీలిస్తూ.. పదవుల కోసం ప్రాకులాడే నాయకులు.. అధికారం దక్కగానే రైతు సమస్యలను మరచిపోతున్నారనే ఆరోపణలు కోకొల్లలుగా ఉన్నాయి.. పదవుల కోసం రైతులను పావులుగా వాడుకుంటున్న పార్టీల వల్ల రైతులకు ఒరిగింది ఏం లేదనే విమర్శలున్నాయి.

రైతుకు ఇచ్చిన హామీలు నీటి మీది రాతల్లా మారిపోతున్నాయే కానీ వారి తలరాతను మార్చడం లేదని వాపోతున్న వారు ఎందరో ఉన్నారు. ఈ క్రమంలో యూరియా కోసం రైతు పడుతున్న కష్టం చూస్తే.. అన్నదాత పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్థమవుతోంది.

మెదక్ జిల్లా రంగంపేటలో ఒక్క యూరియా బస్తా కోసం ఓ వృద్ధ రైతు.. సొసైటీ సిబ్బంది కాళ్లు మొక్కుతూ వేడుకున్న వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సారూ.. ఒక్క యూరియా బస్తా ఇవ్వండి.. మీ కాళ్లు మొక్కుతా అంటూ రైతు వేడుకోవడం హృదయాలను కలచివేస్తుంది. ఇక పంట వేసిన రైతుకు నీరు, విత్తనం, ఎరువు.. ఇవన్నీ సమయానికి అందచేయడం ప్రభుత్వ బాధ్యత. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోందనే ఆరోపణలున్నాయి..

ప్రస్తుతం యూరియా కోసం గంటల తరబడి క్యూలలో నిలబడే పరిస్థితులు తలెత్తాయని రైతులు వాపోతున్నారు. ఎరువు కోసం పొలాన్ని వదిలి సొసైటీల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేద వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అసలు సమస్య ఎక్కడుంది ? యూరియా సరఫరా తక్కువగా ఉందా? లేక పంపిణీ వ్యవస్థలో లోపాలున్నాయా? సరఫరా ఉన్నా.. రైతుకు ఎరువులు ఎందుకు అందడం లేదు? ముందస్తు ప్రణాళికలో లోపం ఉందా? క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ ఎందుకు కనిపించడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మరోవైపు రైతులు పంటలు వేసే ముందు నుంచే ఎరువు అవసరాన్ని అంచనా వేసి.. డిమాండ్‌కు అనుగుణంగా నిల్వలు, సరఫరా, పంపిణీ వ్యవస్థను సిద్ధం చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి, అధికారులకు ఉంది. కానీ రైతు క్యూలో నిలబడి.. చివరకు ఒక్క బస్తా కోసం వేడుకునే పరిస్థితి వస్తే.. ఇది కేవలం యూరియా కొరత సమస్యగా కాకుండా... వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించే అంశంగా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.

అన్నదాతకు గౌరవం ఇవ్వడం అంటే కేవలం హామీలు ఇవ్వడం కాదు.. అవసరమైన సమయంలో కావలసిన సహాయం.. అందివ్వడం ముఖ్యమని గుర్తించలేని నాయకులకు.. రైతు సంక్షేమమే లక్ష్యం అని చెప్పే ప్రభుత్వాలకి.. క్షేత్రస్థాయిలో వ్యవసాయదారులు పడుతున్న ఈ కష్టాలు కనిపించడం లేదా? అని ప్రతి రైతు గుండె ఘోషిస్తుంది. ఈ పరిస్థితికి పరిష్కారం ఎప్పుడని ప్రశ్నిస్తుంది.

#Telangana#Medak district#Rangampet#urea bag#elderly farmer#Praja Palana
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి