డేటింగ్ యాప్ పరిచయం కాస్త ఓ యువతిని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేసింది.పెళ్లివరకు వెళ్లిన ఈ బంధం కాస్త యువకుడి ప్రవర్తనతో రద్దు అయ్యింది. దీంతో సదరు వ్యక్తి యువతిని వేధించడం మొదలుపెట్టాడు. నిశ్చితార్థం రద్దు చేసుకుందనే కోపం ఇదంతా చేయడం ప్రారంభించాడు. మొహంపై యాసిడ్ పోస్టా.. లేదా చంపేస్తా.. అని బెదిరింపులు మొదలెట్టడంతో సదరు యువతి భయపడి ఇంట్లోనే ఉంటున్నట్టు సమాచారం.
వివరాల్లోకివెళితే.. హైదరాబాద్–వనస్థలిపురంలో ఉంటున్న యువతి (33).. ఓ బీమా కంపెనీలో డిప్యూటీ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తోంది.ఆమెకు డేటింగ్ యాప్ ద్వారా తిరుపతికి చెందిన అంబావారి వంశీ అనే యువకుడు పరిచయం అయ్యాడు. కొంతకాలం ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఇరు కుటుంబాలను ఒప్పించుకుని పెళ్లివరకు ప్రేమ బంధాన్ని తీసుకెళ్లారు. అయితే, తాను రొమ్ము క్యాన్సర్‌కు విరుగుడు ఔషధాలు కనిపెట్టేందుకు అమెరికాలో సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టాలని, అందుకు డబ్బులు కావాలని యువతి నుంచి రూ.15 లక్షలు తీసుకున్నాడు వంశీ..
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగింది.అనంతరం కట్నం మొత్తం అడ్వాన్స్‌గా చెల్లించాలని వంశీ యువతిని వేధించడం మొదలుపెట్టాడు. అది భరించలేకపోయిన యువతి తన కుటుంబ సభ్యులకు చెప్పి నిశ్చితార్థం రద్దు చేసుకుంది. నిశ్చితార్థం రద్దు చేసుకుందనే కోపంతో ఆమె డ్రగ్స్‌కు బానిసైందని, ఆమె తమ్ముడు ఉగ్రవాదులకు డబ్బులు సమకూరుస్తాడని యువతి ఆఫీసుకు వంశీ మెయిల్స్ పంపడం మొదలుపెట్టినట్టు తెలిసింది.
https://x.com/TeluguScribe/status/2087746614450688038?s=20
అంతేకాకుండా, బయట కనిపిస్తే యాసిడ్ పోస్తానని లేదా చంపేస్తానని బెదిరించడంతో భయపడి సదరు యువతి ఇంట్లోనే ఉంటున్నట్టు సమాచారం. జూన్ నెలలో పోలీసులకు ఫిర్యాదు చేసినా వేధింపులు ఆగలేదు. ఇదిలాఉండగా, ఈ నెల 4న యువతి తనను బెదిరిస్తుందని తిరుపతి పీఎస్‌లో వంశీ ఫిర్యాదు చేయగా.. ఆమెపై పోలీసులు కేసు ఫైల్ చేశారు. తన వాదన వినకుండానే తిరుపతి పోలీసులు కేసు నమోదు చేశారని, మరుసటి రోజు అనగా 5వ తేదీన వనస్థలిపురంలో బాధిత యువతి ఫిర్యాదు చేసింది.


