Geethanjali: అక్కినేని నాగార్జున నటించిన సినిమాలలో ఎప్పటికీ చెప్పుకునే సినిమాలలో శివ, గీతాంజలి. ఈ సినిమాలను అభిమానులే కాదు, సినీ లవర్స్ కూడా లెక్కకు మించి చూస్తున్నారు. గీతాంజలి, శివ..ఈ రెండు చిత్రాల జోనర్స్ వేరే. కానీ, నాగార్జున కెరీర్‌లో వీటికి, ప్రత్యేక స్థానం ఉంటింది. అలాంటి చిత్రాల్లో గీతాంజలి మళ్ళీ మన ముందుకు రాబోంది. ఆగస్టు 28న నాగార్జున బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను రీరిలీజ్ చేయబోతున్నారు.
అక్కినేని నాగార్జున మేకోవర్ దగ్గర్నుంచీ సినిమాలో పాత్ర, కథ-కథనం అన్నీ అప్పటి సినిమాలతో పోల్చుకుంటే దర్శకుడు మణిరత్నం కంప్లీట్ డిఫరెంట్‌గా ప్లాన్ చేశాడు. నాగార్జున లుక్ విషయంలో కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. పోస్టర్స్ చూసినప్పుడు కొంత నెగిటివిటీ కూడా వినిపించింది. కానీ, సినిమా రిలీజయ్యాక మాత్రం గ్యారెంటీగా ఇది ఓ క్లాసిక్‌లా నిలిచిపోతుందని అందరూ చెప్పుకున్నారు.
అలాగే, ఇప్పటికీ గీతాంజలి సిమిమా స్మాల్ స్క్రీన్ మీద వస్తే వదలని వీరాభిమానులున్నారు. మణి రత్నం రాసుకున్న కథ అప్పట్లో ఓ హాట్ టాపిక్. ఇక, ఇళయరాజా అందించిన సంగీతం సినిమాలోని ప్రతీ సీన్ మూడ్ ని అద్భుతంగా క్యారీ చేసింది. సాంగ్స్ అప్పటికీ, ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌గా నిలిచిపోయాయి. నాగార్జున, గిరిజ శెట్టర్ ల మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్, ఎమోషనల్ సీన్స్, క్లైమాక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు.

ఇక, ఈ సినిమాను ఆగస్టు 28వ తేదీన 4కె లో రిలీజ్ చేస్తున్నాడు. తాజాగా దీనికి సంబదించిన అప్‌డేట్ ఇస్తూ నాగార్జునపై డిజైన్ చేసిన ఓ కొత్త పోస్టర్స్ కూడా వదిలారు. ఇప్పటికే, నాగార్జున నటించిన శివ సినిమా రీరిలీజై మంచి ఆదరణను దక్కించుకుంది. ఈ క్రమంలోనే గీతాంజలి సినిమా కూడా రీరిలీజ్ అయి భారీ హిట్ సాధిస్తుందని అందరూ భావిస్తున్నారు. చూడాలి, మరి ఈ క్లాసిక్ రీరిలీజ్‌కి ఏ రేంజ్‌లో రెస్పాన్స్ వస్తుందో.












