తెలంగాణ

HYDRAA: హైడ్రా కమిషనర్‌కు బిగ్‌షాక్.. సుమోటోగా కోర్టుధిక్కరణ నోటీసులు!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

న్యాయస్థానాల స్టే ఉత్తర్వులు అమలులో ఉన్నప్పటికీ ప్రైవేటు ఆస్తులను కూల్చివేయడంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్ డిజాస్టర్ అండ్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై కోర్టు ధిక్కరణ చర్యలను సుమోటోగా స్వీకరించిన ధర్మాసనం, ఆయనకు నోటీసులు జారీ చేస్తూ రెండు వారాల్లోగా పూర్తి వివరణ ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని వాణి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ పరిధిలో (సర్వే నంబర్లు 194/1, 211) కోర్టు ముందస్తు స్టే ఉన్నప్పటికీ కూల్చివేతలు చేపట్టడంపై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ కేసు విచారణకు హాజరైన మేడ్చల్ జిల్లా కలెక్టర్, మల్కాజిగిరి, తిరుమలగిరి తహసీల్దార్లు.. తాము ఈ కూల్చివేతలకు ఎలాంటి అనుమతులు లేదా ఉత్తర్వులు ఇవ్వలేదని కోర్టుకు స్పష్టం చేశారు. తమ అధికారుల ఆదేశాలు లేకుండానే జిల్లా పరిధిలో దాదాపు 40 ప్రాంతాల్లో హైడ్రా చర్యలు తీసుకుందని కలెక్టర్ నివేదించారు.

దీనిపై స్పందించిన హైడ్రా తరఫు న్యాయవాది, జీఎఎల్ఆర్ నిబంధనల ప్రకారం ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసమే రెవెన్యూ సమాచారం మేరకు చర్యలు చేపట్టామని తెలిపారు. అయితే, సరైన ఆధారాలు, రెవెన్యూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించకుండా ఏకపక్షంగా ప్రైవేటు ఆస్తుల కూల్చివేతలు చేపట్టడం చట్టవిరుద్ధమని ధర్మాసనం హెచ్చరించింది.

ఈ క్రమంలోనే హైడ్రా పరిధిలోకి వచ్చే జిల్లాల కలెక్టర్లందరూ తమ వద్ద ఉన్న కోర్టు స్టే ఉత్తర్వుల వివరాలను తక్షణమే హైడ్రాకు అందించాలని, దీనిపై రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని ఆదేశించింది. హైడ్రా ఆవిర్భావానికి ముందు నమోదైన కోర్టు ఆదేశాలను కూడా పరిగణనలోకి తీసుకోకపోవడంపై ఫిర్యాదులు వస్తున్నాయని వ్యాఖ్యానిస్తూ, తదుపరి విచారణను ఆగస్టు 27కి వాయిదా వేసింది.

#HYDRA Commissioner#AV Ranganath#Telangana High Court#Contempt of Court#HYDRA Demolitions#Hyderabad Real Estate#Telangana News#Swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి