తెలంగాణ

Hyderabad: మెట్రో పాస్‌ల పై ఎల్‌ అండ్‌ టీ కీలక నిర్ణయం!..

రచన: Venu••4 నిమిషాల పఠనం

హైదరాబాద్ మెట్రోరైలు లిమిటెడ్ బోర్డు సమావేశంలో ప్రధాన కార్యదర్శి, హెచ్‌ఎంఆర్‌ఎల్ ఛైర్మన్ సంజయ్‌జాజు.. మెట్రోలో పాస్‌లను ప్రవేశపెట్టేందుకు మార్గాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు ఎల్‌అండ్‌టీ మెట్రో యాజమాన్యంతో చర్చలు జరిపారు. ఈ క్రమంలో సంస్థ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో.. ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించే అవకాశం కనిపిస్తోంది.

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పాస్‌ల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రోజువారీగా మెట్రోలో ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులు.. రోజువారీ, నెలవారీ పాస్‌లు అందుబాటులోకి తీసుకురావాలని చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు.

అయితే ప్రస్తుత మెట్రో నెట్‌వర్క్‌లో పాస్‌లను ప్రవేశపెట్టడం సాధ్యం కాదన్న అభిప్రాయాన్ని ఎల్‌అండ్‌టీ హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ ఇప్పటివరకు వ్యక్తం చేస్తూ వచ్చింది. ప్రయాణికుల సమస్యను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం మాత్రం దీనికి పరిష్కారం కనుగొనే దిశగా అడుగులు వేస్తోంది. ఇటీవల హైదరాబాద్ మెట్రోరైలు లిమిటెడ్ బోర్డు సమావేశంలో ప్రధాన కార్యదర్శి, హెచ్‌ఎంఆర్‌ఎల్ ఛైర్మన్ సంజయ్‌జాజు.. మెట్రోలో పాస్‌లను ప్రవేశపెట్టేందుకు మార్గాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు.

దీంతో అధికారులు ఎల్‌అండ్‌టీ మెట్రో యాజమాన్యంతో చర్చలు జరిపారు. ఈ క్రమంలో సంస్థ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో.. ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించే అవకాశం కనిపిస్తోంది. ఇక పాస్‌ల సమస్యతో పాటు మెట్రో, ఆర్టీసీ ప్రయాణికులకు ఉపయోగపడేలా ఉమ్మడి టికెట్ లేదా ఉమ్మడి పాస్‌ విధానం తీసుకురావచ్చా అనే అంశంపైనా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

ఈ నేపథ్యంలో గురువారం జరిగే హెచ్‌ఎంఆర్‌ఎల్ బోర్డు సమావేశం కీలకంగా మారింది. పాస్‌ల అంశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి? ప్రయాణికులపై భారం తగ్గించేందుకు ఎలాంటి ప్రత్యామ్నాయ విధానం తీసుకురావాలి? మెట్రో, ఆర్టీసీ సేవలను ఎలా అనుసంధానం చేయాలి? వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.

ఇప్పటికే ఆర్టీసీతో జరిగిన సమావేశంలో ఉమ్మడి టికెట్, పాస్‌లపై జరిగిన చర్చల పురోగతిని కూడా అధికారులు సమీక్షించనున్నారు. మొత్తంగా.. ఎల్‌అండ్‌టీ అభ్యంతరాలు ఉన్నప్పటికీ ప్రయాణికుల సమస్యకు పరిష్కారం చూపించేందుకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. బోర్డు సమావేశం తర్వాత మెట్రో పాస్‌లపై స్పష్టత వచ్చే అవకాశముందని తెలుస్తుంది.

#Telangana#Hyderabad#L&T#Metro passes#HMRL
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి