ఏపీ

AP : వీసా కోసం ఫేక్ డిగ్రీ.. ఏపీ యువకుడిపై యూఎస్ ఎంబసీ కేసు

రచన: Kumar••4 నిమిషాల పఠనం

డాలర్ డ్రీమ్స్ కొందరిని మోసాలకు పాల్పడేలా చేస్తున్నది. ఫలితంగా కొందరు అమెరికాలో అడుగుపెట్టకుండానే చిక్కుల్లో పడుతుంటే మరికొందరు అక్కడకు వెళ్లాక ఇబ్బందులు పడాల్సి వస్తోంది.ఇటీవలి కాలంలో దొంగ పత్రాలు సమర్పించడం, ఎటువంటి సరైన పత్రాలు లేకుండా అమెరికాలో అడుగుపెట్టిన వారిని అక్కడి ప్రభుత్వం తిరిగి వారి వారి సొంత దేశాలకు డిపోర్టు చేస్తున్న విషయం తెలిసిందే.

డాలర్ డ్రీమ్స్ కొందరిని మోసాలకు పాల్పడేలా చేస్తున్నది. ఫలితంగా కొందరు అమెరికాలో అడుగుపెట్టకుండానే చిక్కుల్లో పడుతుంటే మరికొందరు అక్కడకు వెళ్లాక ఇబ్బందులు పడాల్సి వస్తోంది.ఇటీవలి కాలంలో దొంగ పత్రాలు సమర్పించడం, ఎటువంటి సరైన పత్రాలు లేకుండా అమెరికాలో అడుగుపెట్టిన వారిని అక్కడి ప్రభుత్వం తిరిగి వారి వారి సొంత దేశాలకు డిపోర్టు చేస్తున్న విషయం తెలిసిందే. అక్రమ వలసదారులను అరికట్టేందుకు ట్రంప్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.

ఈ క్రమంలోనే తప్పుడు సర్టిఫికెట్స్ సమర్పించి అమెరికాకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఏపీకి చెందిన ఓ యువకుడు చిక్కుల్లో పడ్డాడు. అతనికి డాక్యుమెంట్స్ సమకూర్చిన వ్యక్తిపైనా కేసు నమోదు అయ్యింది. వివరాల్లోకివెళితే.. ఏపీలోని తణుకు ప్రాంతానికి చెందిన శశాంక్ రవితేజ అనే యువకుడు అమెరికా వెళ్లేందుకు నకిలీ డాక్యుమెంట్స్ సంపాదించాడు.

వీసా కోసం రాజస్థాన్ మేవాడ్ యూనివర్సిటీలో బీకాం కంప్యూటర్స్ చదివినట్లు నకిలీ సర్టిఫికెట్స్, అదేవిధంగా ఫ్రంటెకాస్ అనే సంస్థలో 2023లో ఉద్యోగంలో చేరినట్టు అపాయింట్‌మెంట్ లెటర్, పే స్లిప్పులు, ఎక్స్‌పీరియన్స్ లెటర్, రూ.1,20,92,950 ఆస్తులు ఉన్నట్టు చూపించాడు. తన పేరిట రూ.50 లక్షలు, ఆకుల మురళీకృష్ణ పేరిట రూ.45 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్టు హైదరాబాద్ కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి ఫేక్ డాక్యుమెంట్లు సంపాదించి వీసా కోసం సమర్పించాడు.

అయితే, ఈ నెల 7వ తేదీన ఇంటర్వ్యూ చేసినప్పుడు వెరిఫికేషన్‌లో భాగంగా అవన్నీ తప్పుడు డాక్యుమెంట్స్ అని తేలింది. ఇదే విషయాన్ని అధికారులు ప్రశ్నించగా.. చేసిన తప్పును శశాంక్ రవితేజ అంగీకరించాడు. విజయవాడకు చెందిన నితిన్ తనకు ఫేక్ డిగ్రీ ఇప్పించాడని అధికారుల ఎదుట ఒప్పుకున్నాడు. దీంతో ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయ అధికారుల ఫిర్యాదు మేరకు శశాంక్ రవితేజతో పాటు, నకిలీ పత్రాలు ఇప్పించిన వారిపై చాణక్యపూరి పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్త చేపట్టారు.

#Um Embassy#casefile#fake degrees#US visa#Andrapradesh
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి