రెండేండ్ల కింద ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ మళయాళ సోషల్ మీడియా ఇన్ ఫ్లూ యెన్సర్ మేఘా.. తన భర్తను వదిలేసి తను స్థానికంగా ఉంటున్న ఊరిలో బస్ కండక్టర్‌తో వెళ్లిపోయింది. ముందుగా తన భార్య కనిపించడం లేదని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన భర్త అఖిల్..సీసీ ఫుటేజ్ ఆధారంగా తన భార్య బస్ కండక్టర్‌తో వెళ్లిపోయిందని సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు.మేఘా లగేజీ తీసుకుని కారులో వెళ్తున్న దృశ్యాలు అందులో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
అయితే, అఖిల్ , మేఘా రెండేండ్ల కింద లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరిమధ్య మనస్పర్దలు వచ్చినట్టు తెలుస్తోంది.అయితే, మేఘా బస్ కండక్టర్ తో వెళ్లిపోయిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చెడు ప్రచారం చేసిన తన భర్తకు.. మేఘా గట్టి కౌంటర్ ఇచ్చింది. ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్టు పెట్టి వెంటనే డిలీట్ చేసినట్టు సమాచారం.
అందులో ఏముందంటే.. ‘నాకు అఖిల్ వద్దు.. కండక్టరే కావాలి. తను లేకపోతే నేను ఉండలేను.. మమ్మల్ని విడదీయకండి. తను కండక్టర్ అయినా క్లీనర్ అయినా అతనితోనే ఉంటా. అఖిల్‌కు ఇతర యువతులతో సంబంధాలు ఉన్నాయి. నన్ను సరిగ్గా చూసుకోవడం లేదు. ఇంటికి వచ్చి నన్ను రోజు వేధించేవాడు. అఖిల్ వేధింపుల కారణంగా ఇంటి నుంచి వెళ్లిపోతున్నా’ అని ఇన్ స్టాలో మేఘా ఓ వీడియోను పోస్టు చేసింది.ఏమైందో తెలీదు కొన్ని నిమిషాల వ్యవధిలోనే మళ్లీ దాన్ని డిలీట్ చేసినట్టు సమాచారం.
ఇదిలాఉండగా, భర్తతో కలిసి జీవించడం ఇష్టం లేక వెళ్లిపోయిన సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ మేఘాకు పలువురు సంఘీభావం తెలుపుతున్నారు. జీవిత భాగస్వామి అర్థం చేసుకోనప్పుడు ఎవరితో అయితే సంతోషంగా ఉంటామో వారితోనే కలిసి వెళ్లిపోవడం, జీవించడం ఉత్తమమని కొందరు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.












