టాప్ న్యూస్

TG : ఇందిరమ్మ ఇళ్ల టెన్షన్.. రోడ్డున పడ్డ 20 వేల మంది క్యాబ్ డ్రైవర్లు?

రచన: Kumar••4 నిమిషాల పఠనం

ఇందిరమ్మ ఇళ్లులు లబ్దిదారుల పాలిట శాపంగా మారాయని ప్రచారం జరుగుతోంది. బిల్లులు రాక చాలా మంది లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా క్యాబ్ డ్రైవర్లు నరకం చూస్తున్నట్టు తెలుస్తోంది. వారిని కారు ఓనర్లుగా పరిగణిస్తూ అధికారులు బిల్లులు విడుదల చేయడం లేదని సమాచారం.

ఇందిరమ్మ ఇళ్లులు లబ్దిదారుల పాలిట శాపంగా మారాయని ప్రచారం జరుగుతోంది. బిల్లులు రాక చాలా మంది లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా క్యాబ్ డ్రైవర్లు నరకం చూస్తున్నట్టు తెలుస్తోంది. వారిని కారు ఓనర్లుగా పరిగణిస్తూ అధికారులు బిల్లులు విడుదల చేయడం లేదని సమాచారం. దీంతో కొందరు కారు అమ్ముకుని బిల్లుల కోసం అధికారుల చుట్టూ తిరుగున్నట్టు తెలిసింది.

జీవనోపాధి కోసం క్యాబ్‌లు, మినీ వ్యాన్లు నడుపుతూ, ఉండేందుకు ఇళ్లు లేక ఇందిరమ్మ ఇల్లు కోసం పలువురు క్యాబ్ డ్రైవర్లు దరఖాస్తు చేసుకోగా..దరఖాస్తు సమయంలో వారిని అర్హులుగా ప్రకటించిన అధికారులు.. ఇల్లు నిర్మించుకున్నాక బిల్లు మంజూరు చేసే సమయంలో మీకు సొంత కారు ఉంది అని వారిని అనర్హులుగా గుర్తిస్తున్నట్టు తెలిసింది.

20వేల మంది క్యాబ్ డ్రైవర్లు?

నాలుగు చక్రాల వాహనం ఉన్నవారు పేదవారు కాదని బిల్లులు చెల్లించకుండా నిరాకరిస్తున్నట్టు సమాచారం. దీంతో కొందరు బిల్లుల కోసం తమ జీవనోపాధి అయిన క్యాబ్( కారు)ను అమ్మేయడం, ఇతరుల పేర్లపై బదిలీ చేసి అఫిడవిట్లు సమర్పించినా ఫలితం దక్కడం లేదని తెలుస్తోంది.దాదాపు 20 వేల మంది లబ్ధిదారులు ఇదే జాబితాలో బిల్లు రాక ఇబ్బంది పడుతున్నట్టు సమాచారం.

దరఖాస్తు చేసుకునేటప్పుడు అర్హత ఉందంటేనే అప్పు చేసి ఇల్లు కట్టుకున్నామని, ఇప్పుడు అర్హులు కాదని బిల్లులు ఆపేస్తే తమ పరిస్థితి ఏంటని క్యాబ్ డ్రైవర్లు, క్యాబ్ ఓనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటా రాకపోవడంతో, దాదాపు లక్షన్నర ఇందిరమ్మ ఇళ్లకు చివరి బిల్లు మంజూరు కాలేదని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేశాకే చివరి బిల్లు విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.

ఒకవేళ కేంద్రం నిధులు ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చెల్లిస్తే.. మళ్లీ కేంద్రం నిధులు విడుదల చేస్తే లబ్ధిదారుడి ఖాతాలో డబుల్ పేమెంట్ అవుతుందని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.దీంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్షన్నర ఇళ్లకు రూ.1,500 కోట్లకు పైగా చివరి బిల్లు నిధులు పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.

https://x.com/TeluguScribe/status/2087741160228057410?s=20

#indiramma houses#no bills#cab drivers#suffers#telangana
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి