తెలంగాణ

Hyd : రెస్ట్ రూంలో విద్యార్థిని చితకబాదిన తోటి స్టూడెంట్స్.. ఎందుకంటే?

రచన: Kumar••4 నిమిషాల పఠనం

హైదరాబాద్ మహానగరంలోని ఓ కాలేజీలో మరోసారి ర్యాగింగ్ కలకలం రేపినట్టు తెలుస్తోంది. రెండ్రోజుల కిందట దమ్మాయిగూడలోని శ్రీ చైతన్య స్కూల్లో పదో తరగతి విద్యార్థిపై సుమారు 12 మంది సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ పేరిట చితకబాదిన విషయం తెలిసిందే. కర్రలు, ప్లేట్లతో దాడి చేయడమే కాకుండా కాలిబూట్లతో ముఖం మీద తొక్కినట్టు తెలిసింది.

హైదరాబాద్ మహానగరంలోని ఓ కాలేజీలో మరోసారి ర్యాగింగ్ కలకలం రేపినట్టు తెలుస్తోంది. రెండ్రోజుల కిందట దమ్మాయిగూడలోని శ్రీ చైతన్య స్కూల్లో పదో తరగతి విద్యార్థిపై సుమారు 12 మంది సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ పేరిట చితకబాదిన విషయం తెలిసిందే. కర్రలు, ప్లేట్లతో దాడి చేయడమే కాకుండా కాలిబూట్లతో ముఖం మీద తొక్కినట్టు తెలిసింది. బాధిత విద్యార్థి తన పేరెంట్స్‌కు అసలు విషయం చెప్పగా.. ఈ విషయం కాస్త పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. విద్యార్థి వెన్నులో చర్మం కమిలిపోగా..ముఖం కూడా తీవ్రంగా వాచింది. ఈ విషయం సంచలనం రేపగా.. తాజాగా అలాంటి ఘటనే మరొకటి ఆలస్యంగా వెలుగుచూసింది.

ఉప్పల్‌లోని ఓ డిగ్రీ కాలేజీలో చదువుతున్న విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్టు సమాచారం. బాత్రూంలోకి తీసుకెళ్లి మరి దాడికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. నాగోల్‌కు చెందిన భువన్ మోహిత్.. ఉప్పల్‌లోని లిటిల్ ఫ్లవర్ డిగ్రీ కళాశాలలో బీబీఏ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు.ఈ నెల 3న అదే కాలేజీకి చెందిన తోటి విద్యార్థులు ఛత్రీస్, యశ్వంత్, వినయ్ అతడిని మాట్లాడుకుందామని రెస్టు రూంకు తీసుకెళ్లినట్టు సమాచారం.

అక్కడ యశ్వంత్, వినయ్‌లు భువన్ మోహిత్‌ను గట్టిగా అదిమి పట్టుకోగా.. ఛత్రీస్ అతనిపై దాడి చేసి గాయపరిచినట్టు బాధితుడు ఆరోపించారు. అంతేకాకుండా భువన్.. మొబైల్‌ను సైతం గుంజుకుని కిందకు విసిరేయడంతో ఫోన్ పగిలిపోయినట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు.కాలేజీలోనే ఈ దాడి జరగడం పట్ల బాధిత విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. దాడి జరిగిన మరుసటి రోజు బాధితుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్టు తెలిసింది.కాగా, ఈ ఘటనపై కాలేజీ యాజమాన్యం ఎలాంటి ప్రకటన చేయడం, విద్యార్థుల మీద చర్యలకు ఉపక్రమించకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది. కాగా, ఈ దాడికి సంబంధించిన సమాచారం కూడా తెలియాల్సి ఉన్నది.

#beating#student#washroom#uppal#hyderabad#casefile
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి