తెలంగాణ

TG : పనిచేసే వారికే పట్టం.. త్వరలోనే భారీగా ఐఏఎస్‌ల బదిలీలు?

రచన: Kumar••4 నిమిషాల పఠనం

కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి పరిపాలనా విభాగంలో భారీ మార్పులు చేయాలని చూస్తున్నట్టు సమాచారం. ఎందుకంటే మంత్రులు, అధికారుల మధ్య సమన్వయం కొరవడటం, అధికారుల నిర్లక్ష్యం, అలసత్వం కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలిసింది.

కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి పరిపాలనా విభాగంలో భారీ మార్పులు చేయాలని చూస్తున్నట్టు సమాచారం. ఎందుకంటే మంత్రులు, అధికారుల మధ్య సమన్వయం కొరవడటం, అధికారుల నిర్లక్ష్యం, అలసత్వం కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలిసింది. ఇదివరకే పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం.. మరోసారి కీలక అధికారులకు స్థానచలనం కల్పించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.

ఇటీవలి కాలంలో కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులు మంత్రుల మాటను కూడా లెక్కచేయడం లేదని తెలుస్తోంది. కీలక శాఖలకు చెందిన ఫైల్స్‌ను పెండింగులో పెట్టడం, మంత్రుల సిఫారసు ఉన్నా వాటి మీద కొర్రీలు పెట్టి తిప్పిపంపడం, లేదా అప్రూవల్ ఇవ్వడంలో జాప్యం చేయడం చేస్తున్నట్టు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు వరుసగా మంత్రులకు ఫిర్యాదు చేస్తున్నట్టు తెలిసింది. దాంతో వారు కూడా అధికారుల తీరు పట్ల విసుగు చెందినట్టు సమాచారం.

ఇదే విషయాన్ని సీఎం రేవంత్ దృష్టికి వారు తీసుకెళ్లినట్టు సమాచారం.ఈ క్రమంలోనే మంచి పనితనం కనబరిచిన వారికి ప్రమోషన్లు, చేయనివారిని పక్కనబెట్టాలని సీఎంవో నుంచి సీఎస్ సంజయ్ జాజుకు ఆదేశాలు అందినట్టు సమాచారం.దీంతో త్వరలోనే రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌లు బదిలీ కానున్నారని టాక్ వినిపిస్తోంది.

ఈసారి పనిచేసే వారికి మంచి పదోన్నతలు, కీలక శాఖలు అప్పగిస్తారని తెలుస్తోంది. పనితనం సరిగా లేకుండా వరుసగా ఫిర్యాదు వస్తున్న వారిని ప్రాధాన్యత లేని పోస్టులు కట్టబెడతారని తెలుస్తోంది. ఇక వరుసగా సెలవులు పెట్టేవారిని, టూర్లకు తిరిగే వారిని లూప్ లైన్‌లోకి పంపిస్తారని సమాచారం. ముఖ్యంగా విద్యాశాఖ, ఆర్థిక శాఖలో వరుసగా ఫిర్యాదులు వస్తున్నందున..ఇప్పుడున్న వారికి స్థానచలనం కల్పించి కొత్తగా సీనియర్ ఐఏఎస్‌లకు బాధ్యతలు ఇస్తారని తెలుస్తోంది.

సీఎంవో- మంత్రుల శాఖ మధ్య సమన్వయం కోసం ఈ బదిలీలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. పరిపాలనలో నూతన దిశ, పనితీరుకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎస్ సంజయ్ జాజు ఆలోచిస్తున్నట్టు తెలిసింది. పనితీరు, ఫైల్స్ త్వరగా మూమెంట్ ఉండాలని ఆదేశాలు ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే స్పెషల్ సీఎస్ స్థాయి నుంచి హెచ్‌ఓడీ వరకు అధికారులకు స్థానచలనం ఉంటుందని సచివాలయం వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

#IAS transfers#CMO#cm revanth reddy#telangana#secretariot
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి